ఎన్‌ఎస్ఈ సరికొత్త రికార్డు
ABN , Publish Date - Nov 27 , 2026 | 03:33 AM
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎస్ఈ) షేరు ధర గురువారం ఒకదశలో 3.55 శాతం ఎగబాకి రూ.2,400 వద్ద సరికొత్త ఇంట్రాడే రికార్డు గరిష్ఠాన్ని...
ఇంట్రాడేలో రూ.2,400కు షేరు ధర
రూ.6 లక్షల కోట్లకు చేరువైన విలువ
ప్రపంచంలో మూడో అత్యంత విలువైన
లిస్టెడ్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌గా అవతరణ
ముంబై: నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎస్ఈ) షేరు ధర గురువారం ఒకదశలో 3.55 శాతం ఎగబాకి రూ.2,400 వద్ద సరికొత్త ఇంట్రాడే రికార్డు గరిష్ఠాన్ని నమోదు చేసింది. చివరికి 1.34 శాతం లాభంతో రూ.2,348.60 వద్ద ముగిసింది. దాంతో ఎన్‌ఎస్ఈ మార్కెట్ విలువ రూ.5,81,278.50 కోట్లుగా (దాదాపు 6,280 కోట్ల డాలర్లు) నమోదైంది. ఇంట్రాడేలో రూ.6 లక్షల కోట్లకు చేరువైంది. గడిచిన రెండు సెషన్లలో ఈ ఎక్స్ఛేంజ్ షేరు 6 శాతానికి పైగా పెరిగింది. దాంతో భారత మార్కెట్లోని అత్యంత విలువైన లిస్టెడ్ కంపెనీల జాబితాలో ఎన్‌ఎస్ఈ 9వ స్థానానికి ఎగబాకింది. కాగా, ఇంట్రాడే మార్కెట్ క్యాపిటలైజేషన్ (6,410 కోట్ల డాలర్లు) పరంగా, ఎన్‌ఎన్‌ఈ ప్రపంచంలోనే మూడో అత్యంత విలువైన లిస్టెడ్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌గా అవతరించింది. డాయిష్ బోర్స్ ఏజీ (6,340 కోట్ల డాలర్లు), లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌ల(6,240 కోట్ల డాలర్లు)ను 4, 5 స్థానాలకు నెట్టేసింది.
ఇవి కూడా చదవండి...
కుటుంబంతో కలిసి ఓటు వేసిన గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము
ఎన్టీఆర్ జిల్లాలో పంచాయతీ పోలింగ్.. ఉదయం 8 గంటలకు 8.32 శాతం నమోదు
Read Latest AP News And Telugu News