Share News

కో-లొకేషన్‌ కేసులో సెబీకి ఎన్‌‌ఎస్ఈ రూ.1,500 కోట్ల చెల్లింపు

ABN , Publish Date - Aug 01 , 2026 | 05:06 AM

చాలా ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న కో-లొకేషన్‌ కేసులను పరిష్కరించుకునేందుకు క్యాపిటల్‌ మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీకి నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ (ఎన్‌‌ఎస్ఈ) రూ.1,491.21 కోట్లు...

కో-లొకేషన్‌ కేసులో సెబీకి ఎన్‌‌ఎస్ఈ రూ.1,500 కోట్ల చెల్లింపు

ముంబై: చాలా ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న కో-లొకేషన్‌ కేసులను పరిష్కరించుకునేందుకు క్యాపిటల్‌ మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీకి నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ (ఎన్‌‌ఎస్ఈ) రూ.1,491.21 కోట్లు చెల్లించనుంది. క్యాపిటల్‌ మార్కెట్‌ చరిత్రలో ఇప్పటివరకిదే అతిపెద్ద సెటిల్‌మెంట్‌. కేసుల పరిష్కారం కోసం సవరించిన ఆఫర్‌ను అంగీకరిస్తున్నట్లు సెబీ జూలై 30న తమకు సమాచారం అందించిందని ఎన్‌‌ఎస్ఈ తెలిపింది. దీంతో ఎన్‌‌ఎస్ఈ తొలి పబ్లిక్‌ ఆఫరింగ్‌ (ఐపీఓ) సాఫీగా పూర్తయ్యేందుకు వీలు కలగనుంది. ఐపీఓ ద్వారా రూ.30,000 కోట్ల సమీకరణ కోసం ఎన్‌‌ఎస్ఈ ఇప్పటికే ముసాయిదా పత్రాలను సెబీకి సమర్పించింది.

ఆర్‌టీఐ చట్టం కేసులో ఎన్‌ఎ్‌సఈకి తాత్కాలిక ఊరట: ఎన్‌ఎ్‌సఈ సమాచార హక్కు (ఆర్‌టీఐ) చట్టం పరిధిలోకి వస్తుందన్న కేంద్ర సమాచార కమిషన్‌ (సీఐసీ) ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. సీఐసీ ఆదేశాలను సవాలు చేస్తూ ఎన్‌ఎ్‌సఈ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపేందుకు అంగీకరించిన జస్టిస్‌ విక్రమ్‌ నాథ్‌, సందీప్‌ మెహతాల ధర్మాసనం.. ఈ విషయంపై 4 వారాల్లో స్పందించాలని సీఐసీతో పాటు ఇతరులను కోరింది. స్టాక్‌ ఎక్స్ఛేంజీలు ప్రజల లావాదేవీలను నిర్వహిస్తాయి కాబట్టి వీటిని కూడా ఆర్‌టీఐ చట్టం పరిధిలోకి వచ్చే ప్రజా సంస్థలుగానే పరిగణించబడతాయని సీఐసీ 2007లో ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో ఎన్‌ఎ్‌సఈ అప్పట్లోనే ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. కానీ, ఈ జూలై 1న న్యాయస్థానం సీఐసీకి అనుకూలంగా తీర్పునివ్వడంతో ఎన్‌ఎస్‌ఈ.. సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది.

ఈ వార్తలు కూడా చదవండి:

పాపం.. రిటైర్డ్‌ ఉద్యోగి!

విశ్రాంత ఉద్యోగులకు మరో 2 వేల కోట్లు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Aug 01 , 2026 | 05:06 AM