Share News

భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు.. ఆవిరైన రూ.లక్షల కోట్ల సంపద!

ABN , Publish Date - Sep 24 , 2026 | 03:56 PM

ఈరోజు దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒత్తిడికి గురై భారీ నష్టాలతో ముగిశాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు, రోజంతా విక్రయాల ఒత్తిడి ఎదుర్కొని చివరకు భారీ పతనాన్ని చవిచూశాయి.

భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు.. ఆవిరైన రూ.లక్షల కోట్ల సంపద!
Sensex Plunges 1,247 Points, Nifty Falls Below 23,100

ఆంధ్రజ్యోతి, సెప్టెంబర్ 24: దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ(గురువారం) తీవ్ర ఒత్తిడికి గురై భారీ నష్టాలతో ముగిశాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు, రోజంతా విక్రయాల ఒత్తిడి ఎదుర్కొని చివరకు భారీ పతనాన్ని చవిచూశాయి.


బీఎస్‌ఈ సెన్సెక్స్ ఏకంగా 1,247.71 పాయింట్లు (1.67శాతం) కోల్పోయి 73,580.54 దగ్గర ముగిసింది. ఇవాళ సెన్సెక్స్ గరిష్ఠంగా 74,362.29 స్థాయిని, కనిష్ఠంగా 73,563.92 స్థాయిని నమోదు చేసింది.

ఇక, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 383.70 పాయింట్లు (1.64శాతం) కోల్పోయి 23,063.10 దగ్గర ముగిసింది. నిఫ్టీ ఇవాళ గరిష్ఠంగా 23,281.95 స్థాయిని, కనిష్ఠంగా 23,046.15 స్థాయిని తాకింది.


స్టాక్ మార్కెట్ క్రాష్‌కి ముఖ్యమైన కారణాలు

రూ.100 దాటిన ముడిచమురు (Crude Oil) ధరలు

ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బారెల్‌కు 102.5 డాలర్లను దాటేసింది. భారత్‌ లాంటి చమురు దిగుమతి చేసుకునే దేశాలకు ఇది ద్రవ్యోల్బణ భయాలను పెంచింది.

నిన్న లభించిన లాభాల అనంతరం, గ్లోబల్ హెడ్‌విండ్స్ కారణంగా నిఫ్టీ, సెన్సెక్స్‌లలో ఇన్వెస్టర్లు ఎగువ స్థాయుల్లో లాభాలను స్వీకరించేందుకే ఎక్కువ మొగ్గు చూపారు.

క్షీణించిన రూపాయి విలువ

డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 11 పైసలు తగ్గి 95.84 వద్ద బలహీనపడటం సెంటిమెంట్‌ను దెబ్బతీసింది.

భయాందోళనలను పెంచిన 'ఇండియా విక్స్'

మార్కెట్‌లో ఒడిదుడుకులను సూచించే 'ఇండియా విక్స్' (Volatility Index) ఒక్కరోజే 21 శాతానికి పైగా పెరిగి 12.56కి చేరింది.

IRDAI కొత్త నిబంధనలు, బ్యాంకింగ్ రంగం పతనం

బీమా ఏజెంట్ కమిషన్ల నిబంధనల ప్రక్షాళనకు ఐఆర్‌డిఏఐ (IRDAI) చేసిన ప్రతిపాదనలతో ఇన్సూరెన్స్, ఫైనాన్షియల్ షేర్లు కుప్పకూలాయి. PB ఫిన్‌టెక్, టర్టిల్‌మింట్ ఏకంగా 23శాతం వరకు క్షీణించగా, యాక్సిస్ బ్యాంక్ (3.5శాతం), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (1.3శాతం) నష్టాలు నమోదు చేశాయి.


ఈ వార్తలు కూడా చదవండి

బిహార్‌లో దారుణం.. మరో బాలికపై లైంగిక వేధింపులు..

ఐఐటీ బాంబే విద్యార్థి ఆత్మహత్య కేసు.. వెలుగులోకి సీసీటీవీ దృశ్యాలు..

Updated Date - Sep 24 , 2026 | 03:34 PM

Updated Date - Sep 24 , 2026 | 04:18 PM