బుల్ జోష్!
ABN , Publish Date - Oct 30 , 2026 | 06:16 AM
భారత స్టాక్ మార్కెట్ ప్రామాణిక సూచీలు గురువారం భారీగా లాభపడ్డాయి. అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ ప్రామాణిక వడ్డీ రేట్లను యథాతథంగా...
సెన్సెక్స్ 905 పాయింట్లు జంప్
22,900 ఎగువకి నిఫ్టీ
ముంబై: భారత స్టాక్ మార్కెట్ ప్రామాణిక సూచీలు గురువారం భారీగా లాభపడ్డాయి. అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ ప్రామాణిక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించడంతో పాటు చమురు ధరలు కాస్త తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఇన్వెస్టర్లు బ్యాంకింగ్, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ రంగ షేర్లలో జోరుగా కొనుగోళ్లు చేపట్టడం ఇందుకు దోహదపడింది. దీంతో సెన్సెక్స్ 905.01 పాయింట్ల (1.24 శాతం) వృద్ధితో వారానికి పైగా గరిష్ఠ స్థాయి 74,151.04 వద్దకు చేరుకుంది. నిఫ్టీ 237.90 పాయింట్లు (1.05 శాతం) ఎగబాకి 22,936.75 వద్ద ముగిసింది. ఈక్విటీ వర్గాల సంపదగా భావించే బీఎస్ఈ నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.4.8 లక్షల కోట్లు పెరిగి రూ.477.43 లక్షల కోట్లకు (5.01 లక్షల కోట్ల డాలర్లు) చేరుకుంది.
ఇవి కూడా చదవండి:
డబ్ల్యూపీఎల్ వేలంలో అన్‌సోల్డ్.. మైదానంలో రికార్డుల మోత..
28 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. ఇకపై ఐటీ రంగంలో కొత్త బాధ్యతలు
ముంబై ఇండియన్స్ కీలక నిర్ణయం.. ముగ్గురు కోచ్‌లకు వీడ్కోలు