Share News

నేడు భారీ నష్టాలతో ప్రారంభమైన భారత స్టాక్ మార్కెట్లు

ABN , Publish Date - Mar 19 , 2026 | 10:16 AM

మధ్యప్రాచ్యంలో ఆయిల్ ప్లాంట్లపై జరుగుతోన్న దాడుల ప్రభావం స్టాక్ మార్కెట్లపై పడింది. ముడిచమురు ధరలు పెరగడం, గ్లోబల్ మార్కెట్ల పతనంతో భారతీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. రూపాయి విలువ కూడా కనిష్టానికి పడిపోవడంతో ఇన్వెస్టర్లు గంటల వ్యవధిలోనే లక్షల కోట్ల రూపాయల సంపదను కోల్పోయారు.

నేడు భారీ నష్టాలతో ప్రారంభమైన భారత స్టాక్ మార్కెట్లు
Indian stock market crash

ఆంధ్రజ్యోతి, ఫిబ్రవరి 19: అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు భారతీయ స్టాక్ మార్కెట్‌ను కుదిపేస్తున్నాయి. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య రాజుకున్న యుద్ధ జ్వాలలు, అమెరికా జోక్యం, చమురు ధరల పెరుగుదల వంటి అంశాలు ఇన్వెస్టర్ల కొంపముంచాయి. ఇవాళ (మార్చి 19) ట్రేడింగ్ ప్రారంభం కావడమే భారీ నష్టాలతో మొదలైంది.

ఇరాన్ చమురు కేంద్రాలపై దాడులు మార్కెట్‌ను మరింత భయపెట్టాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర ఒక్కసారిగా 110 డాలర్ల మార్కును దాటింది. భారత్ తన చమురు అవసరాల కోసం దిగుమతులపై ఆధారపడుతుంది కావున, ధరల పెరుగుదల ఆర్థిక వ్యవస్థపై భారం చూపుతుంది.


రూపాయి పతనం: యుద్ధం కారణంగా రూపాయి విలువ చారిత్రాత్మక కనిష్ట స్థాయికి (92.63) పడిపోయింది. ఇది దిగుమతులను మరింత ప్రియం చేస్తూ ద్రవ్యోల్బణానికి దారితీసే అవకాశాన్ని చూపుతోంది. మరోవైపు, అమెరికా (Dow Jones), జపాన్ (Nikkei) మార్కెట్లు భారీగా నష్టపోవడంతో భారతీయ మార్కెట్లలో కూడా అమ్మకాల ఒత్తిడి పెరిగింది. దీంతో కొన్ని గంటల్లో ఇన్వెస్టర్ల సంపద దాదాపు రూ. 8 లక్షల కోట్లు ఆవిరైపోయింది.

బ్యాంకింగ్, ఆటోమొబైల్, కన్స్యూమర్ సెక్టార్ షేర్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కేవలం డిఫెన్స్, ఆయిల్ ఎక్స్‌ప్లోరేషన్ షేర్లు మాత్రమే స్వల్పంగా నిలదొక్కుకున్నాయి.


ఇవి కూడా చదవండి..

రజినీని బాధపెట్టాలనే ఉద్దేశం ఏమాత్రం లేదు.. టీవీకే నేత క్షమాపణలు..

భారీ అగ్నిప్రమాదం.. ఒకే కుటుంబంలో ఏడుగురి సజీవ దహనం!

Updated Date - Mar 19 , 2026 | 10:18 AM