Share News

వాణిజ్య రాకెట్లపై స్కైరూట్‌ దృష్టి

ABN , Publish Date - Nov 01 , 2026 | 02:45 AM

హైదరాబాద్‌కు చెందిన స్పేస్‌ టెక్‌ స్టార్టప్‌ స్కైరూట్‌ ఏరోస్పేస్‌.. పూర్తిస్థాయి వాణిజ్య రాకెట్ల ప్రయోగాలపై దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగా వచ్చే ఏడాది...

వాణిజ్య రాకెట్లపై స్కైరూట్‌ దృష్టి

వచ్చే ఏడాది ప్రారంభం నుంచి ప్రయోగాలు

న్యూఢిల్లీ: హైదరాబాద్‌కు చెందిన స్పేస్‌ టెక్‌ స్టార్టప్‌ స్కైరూట్‌ ఏరోస్పేస్‌.. పూర్తిస్థాయి వాణిజ్య రాకెట్ల ప్రయోగాలపై దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగా వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలో వాణిజ్య రాకెట్‌ ప్రయోగాలను ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక ఉపగ్రహ ప్రయోగ సర్వీసులకు డిమాండ్‌ జోరుగా పెరుగుతున్న నేపథ్యంలో దీన్ని అందిపుచ్చుకోవాలని చూస్తున్నట్టు స్కైరూట్‌ ఏరోస్పేస్‌ సహ వ్యవస్థాపకుడు నాగ భరత్‌ డాకా తెలిపారు. వచ్చే ఏడాది చివరి నాటికి నెలకు ఒక రాకెట్‌ను ప్రయోగించే స్థాయికి చేరుకోవాలన్న సంకల్పంతో ఉన్నామని చెప్పారు. భవిష్యత్తులో నెలకు రెండు ప్రయోగాలు నిర్వహించే స్థాయిలో మార్కెట్‌ అవకాశాలున్నాయని పేర్కొన్నారు. జూలైలో విక్రమ్‌-1 రాకెట్‌ ప్రయోగం విజయవంతమైన నేపథ్యంలో స్కైరూట్‌ వాణి జ్య కార్యకలాపాలు చేపట్టే దిశగా ముందుకు వెళుతోంది. ఈ ఏడాది చివరి నాటికి రెండో ప్రయోగాన్ని నిర్వహించాలన్న లక్ష్యంతో కంపెనీ ఉంది. అలాగే రెండు ప్రయోగాల కోసం అమెరికాకు చెందిన రెఫ్ల్లెక్స్‌ ఆర్బిటల్‌తో, మూడు ప్రయోగాల కోసం హెచ్‌ఈఎక్స్‌20తో ఒప్పందాలు చేసుకుంది. దేశీయ మార్కెట్‌తో పాటు అమెరికా, యూరప్‌, ఆసియా పసిఫిక్‌ మార్కెట్ల నుంచి ఆసక్తి వ్యక్తమవుతోందని నాగ భరత్‌ పేర్కొన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

తుఫాన్ నష్టంపై సమగ్ర అంచనా.. ప్రతి బాధితుడికి న్యాయం: సీఎం చంద్రబాబు

మత్స్యకారుల సమస్యలకు శాశ్వత పరిష్కారాలు అన్వేషించాలి: పవన్ కల్యాణ్

స్థానిక ఎన్నికలు.. బ్యాలెట్ పేపర్ల భద్రతలో ఎలాంటి లోపాలకు తావుండకూడదు: ఏపీ ఎస్‌ఈసీ

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Nov 01 , 2026 | 02:46 AM