Share News

భారీ లాభాల్లో దేశీయ సూచీలు.. 25,800 దాటిన నిఫ్టీ..

ABN , Publish Date - Nov 25 , 2026 | 04:16 PM

సోమవారం భారీ నష్టాలను చవిచూసిన దేశీయ సూచీలు బుధవారం కోలుకున్నాయి. ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 కూడా కీలకమైన 25,800 పాయింట్ల స్థాయికి పైన ముగిసింది.

భారీ లాభాల్లో దేశీయ సూచీలు.. 25,800 దాటిన నిఫ్టీ..
Stock Market

ఇంటర్నెట్ డెస్క్: సోమవారం భారీ నష్టాలను చవిచూసిన దేశీయ సూచీలు బుధవారం కోలుకున్నాయి. ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 కూడా కీలకమైన 25,800 పాయింట్ల స్థాయికి పైన ముగిసింది. ముఖ్యంగా బ్యాంకింగ్, ఐటీ, ఆర్థిక రంగ షేర్లలో కొనుగోళ్లు మార్కెట్‌కు బలాన్నిచ్చాయి. బుధవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,502 పాయింట్లు పెరిగి 83,938 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ 50 సైతం భారీ లాభాలతో 25,800 పాయింట్ల ఎగువన స్థిరపడింది (Sensex Today).


బుధవారం నాటి ట్రేడింగ్‌లో హెవీ వెయిట్ ఎఫ్‌ఎమ్‌సీజీ షేర్ అయిన హిందుస్థాన్ యూనిలివర్ షేర్లు దాదాపు 6 శాతం పెరిగాయి. ఇన్ఫోసిస్, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్ వంటి హెవీ వెయిట్ షేర్లు లాభాలు ఆర్జించడం కూడా మార్కెట్ ర్యాలీకి తోడ్పడింది. బీఎస్ఈలో నమోదైన కంపెనీల మొత్తం మార్కెట్ విలువ దాదాపు రూ.3.5 లక్షల కోట్లు పెరిగింది. విదేశీ సంస్థాగత మదుపరులు కొనుగోళ్లకు మొగ్గుచూపడం మార్కెట్ సెంటిమెంట్‌కు మద్దతుగా నిలిచింది. అలాగే ప్రముఖ బ్యాంకులు, ఐటీ కంపెనీల షేర్లలో కొనుగోళ్లు పెరగడం కూడా సానుకూలంగా మారింది (Nifty Above 25800).


సెన్సెక్స్, నిఫ్టీలో డాబర్ ఇండియా, హెచ్‌యూఎల్, అవెన్యూ సూపర్ మార్కెట్, బ్రిటానియా, టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ లాభాలను ఆర్జించాయి (Indian Stock Market). ఏపీఎల్ అపోలో, ఒరాకిల్ ఫిన్‌సెర్వ్, కల్యాణ్ జువెలర్స్, కేన్స్ టెక్నాలజీస్ మొదలైన షేర్లు నష్టాలను చవిచూశాయి. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 92.23గా ఉంది. కాగా, లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ స్టాక్స్ లాభాలను ఆర్జించినప్పటికీ స్మాల్ క్యాప్ స్టాక్స్‌లో మాత్రం అమ్మకాల ఒత్తిడి కనిపించింది.


ఇవి కూడా చదవండి..

ఆకాశంలో వెండివెన్నెల.. హిమాలయాల మధ్య చంద్రోదయం.. వీడియో వైరల్..


తిరుపరంకుండ్రం కొండపై దీపం వివాదం.. వందేళ్ల క్రితం అసలేం జరిగిందంటే..

Updated Date - Nov 25 , 2026 | 04:16 PM