భారీ లాభాలతో మొదలై నష్టాల్లోకి జారిన సెన్సెక్స్, నిఫ్టీ..
ABN , Publish Date - Nov 23 , 2026 | 10:06 AM
ఈ ఉదయం మార్కెట్ ప్రధాన సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీ భారీ లాభాలతో మొదలైనా ప్రాఫిట్ బుకింగ్‌తో నష్టాల్లోకి జారుకున్నాయి. బ్యాంక్ నిఫ్టీ 2శాతం పైగా కుప్పకూలింది.
ఆంధ్రజ్యోతి, నవంబర్ 23: ఇవాళ (సోమవారం) దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లు బలహీనంగా ఉన్నప్పటికీ, ఉదయం భారీ లాభాలతో (Gap-up) ప్రారంభమైన సూచీలు, ఆ తర్వాత ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో నష్టాల్లోకి జారుకున్నాయి.
బీఎస్ఈ సెన్సెక్స్: క్రితం ముగింపు (83,919.71) తో పోలిస్తే ఉదయం 84,421.97 వద్ద భారీ లాభాలతో మొదలై, ఇంట్రాడేలో 84,662.96 గరిష్ఠాన్ని తాకింది. అయితే ఆ తర్వాత అమ్మకాల ఒత్తిడితో 276.48 పాయింట్లు (-0.33%) నష్టపోయి 83,643.23 వద్ద ట్రేడవుతోంది. (ఒకానొక దశలో సెన్సెక్స్ 600 పాయింట్లకు పైగా పతనమై 83,210.08 కనిష్ఠాన్ని తాకింది).
ఎన్ఎస్ఈ నిఫ్టీ: ఉదయం 25,929.15 వద్ద మొదలై 25,992.60 గరిష్ఠానికి చేరిన నిఫ్టీ, ఆ తర్వాత 94.00 పాయింట్లు (-0.36%) నష్టపోయి 25,706.60 వద్ద ట్రేడవుతోంది. (ఒకానొక దశలో 25,600 మార్కు దిగువకు పడిపోయి 25,567.30 కనిష్ఠాన్ని తాకింది).
బ్యాంక్ నిఫ్టీ, బ్రాడర్ మార్కెట్లు: బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాల వెల్లువతో బ్యాంక్ నిఫ్టీ 2 శాతానికి పైగా కుప్పకూలింది. నిఫ్టీ మిడ్‌క్యాప్ 100, నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100 సూచీలు కూడా దాదాపు 1శాతం చొప్పున నష్టపోయాయి.
నిఫ్టీ ఐటీ (Nifty IT) మినహా దాదాపు అన్ని రంగాల సూచీలు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ముఖ్యంగా నిఫ్టీ మెటల్ 2శాతం పైగా నష్టపోయి టాప్ లూజర్‌గా నిలిచింది. పీఎస్‌యూ బ్యాంక్, ఆటో, రియాల్టీ, ఫార్మా, ఆయిల్, గ్యాస్ రంగాలు నష్టాల్లో కొనసాగుతున్నాయి. టాటా స్టీల్, ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి.
లాభాల స్వీకరణ: ఇటీవల మార్కెట్లు వరుసగా నాలుగు వారాల పాటు భారీగా లాభపడటంతో, గరిష్ఠ స్థాయిల వద్ద ఇన్వెస్టర్లు లాభాలను స్వీకరించేందుకు మొగ్గు చూపారు. దీనికి తోడు ఏఐ (AI) ట్రేడింగ్‌పై ఆందోళనల కారణంగా గత వారం అమెరికా మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. నాస్డాక్ 5.28%, ఎస్&పీ 500 సూచీ 3.70%, డౌ జోన్స్ 1.93% మేర నష్టపోయాయి. దీని ప్రభావంతో నేడు ఆసియా మార్కెట్లు కూడా నష్టాల్లో ట్రేడవుతున్నాయి. (Sensex Nifty Turn Negative)
ఈ వార్తలనూ చదవండి:
ఎన్విడియా చిప్స్ స్మగ్లింగ్ వెనుక చైనా వ్యాపారవేత్త స్కెచ్
భారత్‌లోని వైవిధ్యం ఇతర దేశాలకు కూడా ఆదర్శం: పుతిన్