స్టాక్ మార్కెట్లలో మళ్ళీ నష్టాల పరంపర!
ABN , Publish Date - Sep 08 , 2026 | 04:24 PM
స్టాక్ మార్కెట్లలో మళ్ళీ నష్టాల పరంపర మొదలైంది. ఇవాళ్టి ట్రేడింగ్‌లోనూ దేశీయ బెంచ్‌మార్క్ సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీలు గణనీయమైన క్షీణతను నమోదు చేశాయి.
ఆంధ్రజ్యోతి, సెప్టెంబర్ 8: స్టాక్ మార్కెట్లలో మళ్ళీ నష్టాల పరంపర మొదలైంది. ఇవాళ్టి(మంగళవారం) ట్రేడింగ్‌లోనూ దేశీయ బెంచ్‌మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు క్షీణతను నమోదు చేశాయి. పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు రాజుకోవడంతో అంతర్జాతీయంగా ముడిచమురు (Crude Oil) ధరలు విపరీతంగా పెరగడమే ఈ పతనానికి ప్రధాన కారణంగా నిలిచింది.
నేటి ట్రేడింగ్ సెషన్లో సెన్సెక్స్ (Sensex) 555.23 పాయింట్లు (0.73శాతం) క్షీణించి 75,577.58 వద్ద ముగిసింది. నిఫ్టీ (Nifty 50) 144.05 పాయింట్లు (0.61శాతం) పడిపోయి 23,635.10 వద్ద స్థిరపడింది. మార్కెట్‌లో మొత్తం 2,025 షేర్లు లాభాల్లో ముగియగా, 2,174 షేర్లు నష్టాల్లో ముగిశాయి. 178 షేర్ల ధరల్లో ఎలాంటి మార్పూ లేదు.
ఇవి కూడా చదవండి:
గిల్‌పై ప్రతీకారం తీర్చుకున్న అభిషేక్ శర్మ.. వీడియో వైరల్!
అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్.. వాషింగ్టన్ సుందర్ ఫిట్