SBI ATM Charges: SBI ఖాతాదారులకు అలర్ట్.. ATM ఛార్జీల పెంపు
ABN , Publish Date - Jan 12 , 2026 | 04:12 PM
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ATM లావాదేవీ ఛార్జీలను పెంచింది. ఇంటర్‌ఛేంజ్ ఫీ పెరిగిన నేపథ్యంలో ఈ మార్పు అనివార్యమని ఎస్‌బీఐ తెలిపింది. కొత్త ఛార్జీలు డిసెంబర్ 1, 2025 నుంచి అమలులోకి వచ్చాయి.
ఆంధ్రజ్యోతి, జనవరి 12: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) ఇటీవల ATM ట్రాన్సాక్షన్ ఛార్జీలను పెంచింది. ఇంటర్‌ఛేంజ్ ఫీజ్ పెరిగిన నేపథ్యంలో ఈ పెంపు అనివార్యమైందని బ్యాంకు ప్రకటించింది. కొత్త ఛార్జీలు డిసెంబర్ 1, 2025 నుంచి అమలులోకి వచ్చాయి. ఇదే తరహాలో గతేడాది ఫిబ్రవరి తర్వాత కూడా ఛార్జీలు పెంచిన సంగతి తెలిసిందే.
ముఖ్య మార్పులు:
సేవింగ్స్ అకౌంట్ హోల్డర్లు: ఇతర బ్యాంకుల ATMలలో నెలకు 5 ఫ్రీ ట్రాన్సాక్షన్లు (క్యాష్ విత్‌డ్రాయల్ + నాన్-ఫైనాన్షియల్ లాంటివి) చేసుకోవచ్చు. ఫ్రీ లిమిట్ అయిపోయాక.. క్యాష్ విత్‌డ్రాయల్ కు రూ.23+ GST (గతంలో రూ. 21 + GST) చొప్పున వసూలు చేస్తారు. ఇక, బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం, మినీ స్టేట్‌మెంట్ వంటి నాన్-ఫైనాన్షియల్ లావాదేవీలకు రూ.11 + GST (గతంలో రూ.10 + GST) ఛార్జీలుగా వసూలు చేస్తారు.
శాలరీ అకౌంట్ హోల్డర్లు:
శాలరీ అకౌంట్ హోల్డర్లకు గతంలో అన్‌లిమిటెడ్ ఫ్రీ ట్రాన్సాక్షన్లు ఉండేవి (ఇతర బ్యాంకుల ATMల్లో). ఇప్పుడు నెలకు 10 ఫ్రీ ట్రాన్సాక్షన్లు మాత్రమే (అన్ని లొకేషన్లలో) కల్పించారు. దాని తర్వాత సేవింగ్స్ ఖాతాదార్ల మాదిరే రూ.23 + GST (విత్‌డ్రాయల్) ఇంకా రూ. 11 + GST (నాన్-ఫైనాన్షియల్) చెల్లించాలి. అయితే, SBI సొంత ATMలలో ఛార్జీలు మారలేదు. ఫ్రీ ట్రాన్సాక్షన్లూ పాత పద్ధతిలో అలాగే ఉన్నాయి.
ఎవరు ఎక్స్‌ట్రా పే చేయాలి?
సేవింగ్స్ ఇంకా శాలరీ అకౌంట్ హోల్డర్లు ఫ్రీ లిమిట్ దాటినప్పుడు మాత్రమే ఎక్స్‌ట్రా ఛార్జీలు చెల్లించాలి. కరెంట్ అకౌంట్ హోల్డర్లు కూడా ఛార్జీల పెంపునకు ప్రభావితమవుతారు.
ఎవరికి మినహాయింపు ?
పెన్షనర్లు, BSBD (Basic Savings Bank Deposit) అకౌంట్లు, KCC (Kisan Credit Card) వంటి కొన్ని స్పెషల్ అకౌంట్లకు పూర్తి మినహాయింపు లేదా తక్కువ ఛార్జీలు ఉండొచ్చు (వివరాలు అకౌంట్ టైప్ ప్రకారం వేరువేరుగా ఉంటాయి). SBI సొంత ATMలు ఉపయోగిస్తే ఎవరికీ ఎక్స్‌ట్రా ఛార్జీలు లేవు.
ఈ మార్పులు మెట్రో, నాన్-మెట్రో నగరాల్లో ఫ్రీ లిమిట్లపై RBI గైడ్‌లైన్స్ ప్రకారం ఉన్నాయి. కానీ, SBI ప్రధానంగా ఇతర బ్యాంకుల ATMల వినియోగంపై ఫోకస్ చేసింది. ఇతర వివరాలు, అప్‌డేట్స్ కోసం SBI అధికారిక సైట్ చూడటం మంచింది.
ఈ వార్తలు కూడా చదవండి..
నల్లమల సాగర్‌పై సుప్రీంలో ఊహించని పరిణామం..
భూములు అమ్మి ఖజానా నింపే ఆలోచన మా ప్రభుత్వానికి లేదు: మంత్రి పొంగులేటి
Read Latest Telangana News And Telugu News