Share News

భారత్‌కు తరలివస్తున్న ఆర్‌బీఐ బంగారం నిల్వలు

ABN , Publish Date - Nov 28 , 2026 | 01:01 AM

ఆర్‌బీఐ తన బంగారం నిల్వలను విదేశాల నుంచి భారత్‌కు తీసుకురావడాన్ని వేగవంతం చేసింది.

భారత్‌కు తరలివస్తున్న ఆర్‌బీఐ బంగారం నిల్వలు
gold

  • మరో 60 టన్నులు విదేశాల నుంచి వెనక్కి

న్యూఢిల్లీ: ఆర్‌బీఐ తన బంగారం నిల్వలను విదేశాల నుంచి భారత్‌కు తీసుకురావడాన్ని వేగవంతం చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌ నుంచి సెప్టెంబరు మధ్య (ఆరు నెలల్లో) కాలంలో మరో 60.08 టన్నులను స్వదేశానికి తరలించింది. దీంతో ఆర్‌బీఐ మొత్తం బంగారం నిల్వలు 880.52 టన్నుల్లో 84 శాతం (740.13 టన్నులు) ఇప్పుడు స్వదేశంలోనే ఉన్నాయి. ఈ ఏడాది మార్చి నాటికి స్వదేశంలోని నిల్వలు 77.23 శాతంగానే (680.05 టన్నులు) ఉండడం గమనార్హం. దీంతో బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌, బ్యాంక్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ సెటిల్‌మెంట్స్‌ (బీఐఎస్‌) వద్ద ఆర్‌బీఐ బంగారం నిల్వలు 197.67 టన్నుల నుంచి 140.39 టన్నులకు తగ్గిపోయాయి. తాజా బంగారం కొనుగోళ్లు కాకుండా, విదేశీ వాల్ట్‌ల నుంచి తరలించడం వల్లే దేశీయంగా నిల్వలు పెరిగాయని ఆర్‌బీఐ స్పష్టం చేసింది.

ఇవి కూడా చదవండి:

ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శ‌ర్మ.. అధికారిక ప్రకటన విడుదల

వైభవ్ సూర్యవంశీకి ప్రపంచకప్‌‌లో ఛాన్స్ ఇవ్వాలి: శ్రీకాంత్

Updated Date - Nov 28 , 2026 | 01:01 AM