అమరావతిలో రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్
ABN , Publish Date - Nov 01 , 2026 | 02:52 AM
రెయిన్‌బో చిల్డ్రన్స్ మెడికేర్ లిమిటెడ్ (ఆర్‌సీఎంఎల్).. సెప్టెంబరు త్రైమాసికం (క్యూ2)లో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన...
క్యూ2 లాభం రూ.84 కోట్లు
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): రెయిన్‌బో చిల్డ్రన్స్ మెడికేర్ లిమిటెడ్ (ఆర్‌సీఎంఎల్).. సెప్టెంబరు త్రైమాసికం (క్యూ2)లో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ.556.14 కోట్ల మొత్తం ఆదాయంపై రూ.83.8 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే లాభం 11 శాతం పెరగగా ఆదాయం 23 శాతం పెరిగింది. సమీక్షా త్రైమాసికంలో ప్రస్తుత, కొత్త హాస్పిటల్స్ కోసం రూ.81.9 కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు పేర్కొంది. కాగా క్యూ2లో రెయిన్‌బో హాస్పిటల్స్ ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరులో 70 పడకలు, గుంటూరులో 50 పడకలతో కూడిన హాస్పిటల్స్‌ను ప్రారంభించింది. అలాగే ఏపీ రాజధాని అమరావతిలో తొలుత 150 పడకల సామర్థ్యంతో కూడిన స్పెషాలిటీ పీడియాట్రిక్ హాస్పిటల్‌ను దశలవారీగా ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది.
ఇందుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఇప్పటికే హాస్పిటల్ కోసం రెండెకరాల స్థలాన్ని కూడా కేటాయించిందని రెయిన్‌బో హాస్పిటల్స్ తెలిపింది. మధ్యప్రదేశ్ ఇండోర్‌లో ఏర్పాటు చేస్తున్న హాస్పిటల్ డిసెంబరు త్రైమాసికంలో కార్యకలాపాలు ప్రారంభించనుందని పేర్కొంది. కాగా సెప్టెంబరు ముగిసేనాటికి హాస్పిటల్స్ మొత్తం పడకల సంఖ్య 2,285 నుంచి 2,555 పడకలకు చేరుకుంది. అలాగే క్యూ2 చివరి నాటికి హాస్పిటల్ వద్ద రూ.542.80 కోట్ల నగదు, నగదుకు తత్సమాన నిల్వలు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు ఉన్నాయని తెలిపింది.
ఈ వార్తలు కూడా చదవండి..
తుఫాన్ నష్టంపై సమగ్ర అంచనా.. ప్రతి బాధితుడికి న్యాయం: సీఎం చంద్రబాబు
మత్స్యకారుల సమస్యలకు శాశ్వత పరిష్కారాలు అన్వేషించాలి: పవన్ కల్యాణ్
స్థానిక ఎన్నికలు.. బ్యాలెట్ పేపర్ల భద్రతలో ఎలాంటి లోపాలకు తావుండకూడదు: ఏపీ ఎస్‌ఈసీ
Read Latest AP News And Telangana News And National News
And Telugu News