అమెరికా పర్యటనకు పియూష్ గోయల్.. వాణిజ్య ఒప్పందంపైనే ఫోకస్..
ABN , Publish Date - Sep 28 , 2026 | 08:44 PM
కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్ సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 5 వరకు అమెరికాలో పర్యటించనున్నారు. అమెరికా అధ్యక్షతన జరగనున్న జీ-20 వాణిజ్య మంత్రుల సమావేశంలో ఆయన పాల్గొనబోతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్ సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 5 వరకు అమెరికాలో పర్యటించనున్నారు. అమెరికా అధ్యక్షతన జరగనున్న జీ-20 వాణిజ్య మంత్రుల సమావేశంలో ఆయన పాల్గొనబోతున్నారు. అలాగే భారత్, అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై కీలక చర్చలు జరిపే అవకాశం ఉంది. అమెరికా అధికారిక వర్గాల ప్రకారం, ఈ ఒప్పందానికి సంబంధించిన చర్చలు 90 శాతానికి పైగా పూర్తయ్యాయి. మిగిలిన కొన్ని అంశాలపై ఇరు దేశాలు చర్చలు కొనసాగిస్తున్నాయి (Piyush Goyal US visit).
భారత్, అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో పియూష్ గోయల్ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది. భారత ఎగుమతిదారులకు పోటీ దేశాలతో పోలిస్తే అనుకూలమైన సుంకాల ప్రయోజనం లభించిన తర్వాత తుది వివరాలను ప్రకటిస్తామని పియూష్ గోయల్ గతంలోనే తెలిపారు. కాగా, సెప్టెంబర్ 30, అక్టోబర్ 1 తేదీల్లో మిల్వాకీలో జరిగే జీ-20 వాణిజ్య మంత్రుల సమావేశంలో పియూష్ గోయల్ పాల్గొంటారు (India US trade deal).
జీ-20 సమావేశం అనంతరంఅమెరికా వాణిజ్య ప్రతినిధి జామీసన్ గ్రీర్‌తో గోయల్ ద్వైపాక్షిక చర్చలు జరిపే అవకాశం ఉంది (India US trade agreement 2026). ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య ఒప్పంద చర్చల్లో మిగిలిన అంశాలు ఈ భేటీలో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. గోయల్ పర్యటన సందర్భంగా ద్వైపాక్షిక సమావేశాలు జరిగే అవకాశం ఉందని, భారత్-అమెరికా వాణిజ్య అంశాలు, కొనసాగుతున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పంద చర్చలపై చర్చిస్తారని వాణిజ్య కార్యదర్శి రాజేశ్ అగర్వాల్ ఇటీవల తెలిపారు.
ఇవి కూడా చదవండి..
టీఎంసీ పేరు, గుర్తు వివాదం.. ఈసీకి సుప్రీంకోర్టు కీలక డెడ్‌లైన్..
పార్కింగ్ ఛార్జీలు డబుల్, ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్.. ఢిల్లీలో కాలుష్య నియంత్రణకు కొత్త ప్లాన్..