పీఐ నుంచి పయాక్సజోన్ పురుగు మందు
ABN , Publish Date - Nov 01 , 2026 | 02:48 AM
వరి, మొక్కజొన్న, శనగ పంటల సంరక్షణకు దోహదపడే పయాక్సజాన్ పురుగు మందును పీఐ ఇండస్ర్టీస్ శనివారం మార్కెట్లోకి...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): వరి, మొక్కజొన్న, శనగ పంటల సంరక్షణకు దోహదపడే పయాక్సజాన్ పురుగు మందును పీఐ ఇండస్ర్టీస్ శనివారం మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ సందర్భంగా కంపెనీ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ మయాంక్ సింఘాల్ మాట్లాడుతూ.. వరిలో పసుపుకాండం తొలిచే పురుగు, మొక్కజొన్నలో లద్దెపురుగు, శనగపంటలో కాయ తొలిచే పురుగు నియంత్రణకు ఇది ఉపయోగపడుతుందని చెప్పారు. ప్రస్తుత చీడపీడలు, దేశ వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని దీన్ని అభివృద్ధి చేసినట్టు తెలిపారు. దేశంలో తొలిసారిగా స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన పురుగుమందు పాయక్సానిలిప్రోల్తో దీన్ని తీసుకువచ్చినట్టు చెప్పారు. పయాక్సజాన్ను పంటపై పిచికారి చేసిన 30 నిమిషాల్లోనే మొక్కలో వేగంగా లీనమవుతుందని, దీనివల్ల వర్షం కురిసినా మందు ప్రభావం తగ్గకుండా ఉంటుందన్నారు. అధిక సమర్థతతో స్థిరమైన, సమర్థవంతమైన రక్షణను అందిస్తుందని తెలిపారు. పంటకు మేలు చేసే పురుగులకు ఇది హాని కలిగించదని చెప్పారు. దీన్ని విదేశాలకు కూడా ఎగుమతి చేయాలనుకుంటున్నట్టు తెలిపారు. తమ కంపెనీ రాబడిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల వాటా 20-25 శాతం ఉందన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తుఫాన్ నష్టంపై సమగ్ర అంచనా.. ప్రతి బాధితుడికి న్యాయం: సీఎం చంద్రబాబు
మత్స్యకారుల సమస్యలకు శాశ్వత పరిష్కారాలు అన్వేషించాలి: పవన్ కల్యాణ్
స్థానిక ఎన్నికలు.. బ్యాలెట్ పేపర్ల భద్రతలో ఎలాంటి లోపాలకు తావుండకూడదు: ఏపీ ఎస్ఈసీ
Read Latest AP News And Telangana News And National News
And Telugu News