Share News

వచ్చే ఏడాది చివరికి 29 వేల పాయింట్లకు నిఫ్టీ.. జేపీ మోర్గాన్ అంచనాకు ప్రధాన కారణాలివే..

ABN , Publish Date - Nov 26 , 2026 | 08:45 PM

భారత స్టాక్ మార్కెట్‌పై అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ జేపీ మోర్గాన్ సానుకూల అంచనాలను వెల్లడించింది. 2027 చివరి నాటికి నిఫ్టీ-50 సూచీ 29,000 పాయింట్ల స్థాయికి చేరుకోవచ్చని అంచనా వేసింది.

వచ్చే ఏడాది చివరికి 29 వేల పాయింట్లకు నిఫ్టీ.. జేపీ మోర్గాన్ అంచనాకు ప్రధాన కారణాలివే..
Nifty 29000 Target

ఇంటర్నెట్ డెస్క్: భారత స్టాక్ మార్కెట్‌పై అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ జేపీ మోర్గాన్ సానుకూల అంచనాలను వెల్లడించింది. 2027 చివరి నాటికి నిఫ్టీ-50 సూచీ 29,000 పాయింట్ల స్థాయికి చేరుకోవచ్చని అంచనా వేసింది. ప్రస్తుత స్థాయిలతో పోలిస్తే ఇది సుమారు 12 శాతం వృద్ధిని సూచిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లలో ఏఐ ఆధారిత పెట్టుబడులపై అధికంగా ఆధారపడుతున్నారని, భారత మార్కెట్ మాత్రం పెట్టుబడులకు వైవిధ్యమైన అవకాశాలను అందిస్తోందని జేపీ మోర్గాన్ అభిప్రాయపడింది (Nifty 29000 Target).


మెరుగుపడుతున్న కంపెనీల లాభాలు, దేశీయ వినియోగం, పెట్టుబడుల పెరుగుదల భారత మార్కెట్‌కు ప్రధాన బలాలని పేర్కొంది. 2027 చివరి నాటికి నిఫ్టీ 29,000 పాయింట్లకు చేరుకోవచ్చని పేర్కొంది. పరిస్థితులు మరింత అనుకూలంగా ఉంటే 31,000 వరకు పెరిగే అవకాశం ఉందని, ప్రతికూల పరిస్థితుల్లో 22,000కు పడిపోయే ప్రమాదం కూడా ఉందని తెలిపింది. ముఖ్యంగా భారతీయ కంపెనీల ఆదాయాలు, లాభాలు మెరుగుపడతాయని జేపీ మోర్గాన్ అంచనా వేస్తోంది. ఇండియా కంపెనీల ఆదాయ వృద్ధి 2026లో 12 శాతంగా, 2027లో 14 శాతంగా ఉండవచ్చని ఎంఎస్‌సీఐ పేర్కొంది ( JPMorgan India Outlook).


భారత్‌లో వినియోగదారుల డిమాండ్ నిలకడగా కొనసాగుతుందని జేపీ మోర్గాన్ భావిస్తోంది (Nifty 50 Prediction 2027). బ్యాంకు రుణాల వృద్ధి, ప్రైవేటు రంగ పెట్టుబడులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి కంపెనీల వ్యాపారాలకు ఊతమివ్వనున్నాయని పేర్కొంది. ముఖ్యంగా ప్రైవేటు రంగంలో పెట్టుబడులు పెరగడం పారిశ్రామిక రంగానికి అనుకూలంగా మారవచ్చని అంచనా వేసింది. అంతర్జాతీయంగా ఏఐ ఆధారిత షేర్లలో పెట్టుబడులపై ఆందోళనలు పెరగడంతో, ప్రత్యామ్నాయ పెట్టుబడి మార్గంగా భారత్‌ కనిపిస్తోందని జేపీ మోర్గాన్ చెబుతోంది.


ఇవి కూడా చదవండి..

అమెరికాను వదిలేయాలి లేదా ఉద్యోగం మానేయాలి.. హెచ్-1బీ ఉద్యోగులకు ఐబీఎం షాక్..


అమితాబ్ ఇంటికి మరోసారి బాంబు బెదిరింపు.. ముంబైలో మరిన్ని ప్రాంతాలకు హెచ్చరిక..

Updated Date - Nov 26 , 2026 | 08:45 PM