కొనసాగుతున్న నష్టాలు.. 750 పాయింట్ల కిందకు సెన్సెక్స్..
ABN , Publish Date - Jul 22 , 2026 | 02:07 PM
అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా దేశీయ సూచీలు భారీ నష్టాల్లో కదలాడుతున్నాయి. బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర ఏకంగా 4 శాతం పెరిగి 94.72 డాలర్ల దగ్గర ట్రేడ్ అవుతోంది.
అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా దేశీయ సూచీలు భారీ నష్టాల్లో కదలాడుతున్నాయి. బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర ఏకంగా 4 శాతం పెరిగి 94.72 డాలర్ల దగ్గర ట్రేడ్ అవుతోంది. మరోవైపు ట్రంప్ టారిఫ్‌ల ప్రకటన నేపథ్యంలో ఫార్మా ఇండస్ట్రీ అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొంటోంది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 96.53గా ఉంది. ఈ నేపథ్యంలో సెన్సెక్స్, నిఫ్టీ భారీ నష్టాల్లో కదలాడుతున్నాయి. (Indian stock market).
గత సెషన్ ముగింపు (77,470)తో పోల్చుకుంటే బుధవారం ఉదయం వంద పాయిట్ల నష్టంతో మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత మరింత కిందకు దిగజారింది. తిరిగి 77 వేల మార్క్ దిగువకు చేరుకుంది. మధ్యాహ్నం 2:00 గంటల సమయంలో సెన్సెక్స్ 771 పాయింట్ల నష్టంతో 76,695 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడుతోంది. ప్రస్తుతం 208 పాయింట్ల నష్టంతో 23,978 వద్ద కదలాడుతోంది. చాలా రోజుల తర్వాత 24 వేల మార్క్ దిగువకు పడిపోయింది (stock market news today).
సెన్సెక్స్, నిఫ్టీలో కల్యాణ్ జువెల్లర్స్, బజాజ్ ఆటో, నెస్ట్లే, టీవీఎస్ మెటార్స్, పాలీక్యాబ్ మొదలైన షేర్లు లాభాల్లో ఉన్నాయి (share market news). బంధన్ బ్యాంక్, పీజీ ఎలక్ట్రోప్లాస్ట్, లూపిన్, వోల్టాస్, ఒరాకిల్ ఫిన్‌సెర్వ్ మొదలైన షేర్లు నష్టాల బాటలో సాగుతున్నాయి. బ్యాంక్ నిఫ్టీ 791 పాయింట్ల నష్టంతో ఉంది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 657 పాయింట్ల నష్టంతో ఉంది.
ఇవి కూడా చదవండి..
2028 నుంచి 100% సుంకాలు, ఆ తర్వాత 200%.. జనరిక్ మందులపై ట్రంప్ కీలక నిర్ణయం..
పసిడి ధరలు మరింత పెరిగాయ్.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..