Share News

లాభాల నుంచి నష్టాల్లోకి.. సూచీలకు ఒడిదుడుకులు..

ABN , Publish Date - Apr 20 , 2026 | 03:58 PM

పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో దేశీయ సూచీలు ఆరంభ లాభాలను కోల్పోయాయి. క్రూడాయిల్ ధరలు పెరగడం, అంతర్జాతీయంగా ఉద్రిక్తతల నేపథ్యంలో సూచీలు లాభనష్టాలతో దోబూచులాడాయి. ఉదయం లాభాలతో ప్రారంభమై చివరకు ఫ్లాట్‌గా ముగిశాయి.

లాభాల నుంచి నష్టాల్లోకి.. సూచీలకు ఒడిదుడుకులు..
Stock Market

పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో దేశీయ సూచీలు ఆరంభ లాభాలను కోల్పోయాయి. క్రూడాయిల్ ధరలు పెరగడం, అంతర్జాతీయంగా ఉద్రిక్తతల నేపథ్యంలో సూచీలు లాభనష్టాలతో దోబూచులాడాయి. ఉదయం లాభాలతో ప్రారంభమై చివరకు ఫ్లాట్‌గా ముగిశాయి. సెన్సెక్స్ ఇంట్రాడే గరిష్ఠంతో పోల్చుకుంటే 400 పాయింట్లను కోల్పోయింది (Indian stock market).


గత సెషన్ ముగింపు (78,493)తో పోల్చుకుంటే సోమవారం ఉదయం 100 పాయింట్లకు పైగా లాభంతో మొదలైన సెన్సెక్స్ లాభ నష్టాలతో దోబూచులాడింది. చివరి గంటలో అమ్మకాలు వెల్లువెత్తడంతో కిందకు దిగి వచ్చింది. చివరకు సెన్సెక్స్ 26 పాయింట్ల లాభంతో 78,520 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. చివరకు 11 పాయింట్ల లాభంతో 24,364 వద్ద స్థిరపడింది (stock market news today).


సెన్సెక్స్‌, నిఫ్టీలో ట్రెంట్, ట్యూబ్ ఇన్వెస్ట్‌మెంట్, యూనో మిండా, భెల్, జఎస్‌డబ్ల్యూ స్టీల్ మొదలైన షేర్లు లాభాలు ఆర్జించాయి (share market news). ఐఈఎక్స్, పీఐ ఇండస్ట్రీస్, గాడ్‌ఫ్రే ఫిలిప్, సోనా బీఎల్‌డబ్ల్యూ, ఎస్బీఐ కార్డ్ మొదలైన షేర్లు నష్టాలు మూటగట్టుకున్నాయి. బ్యాంక్ నిఫ్టీ 16 పాయింట్లు లాభపడింది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 107 పాయింట్లు కోల్పోయింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 93.12గా ఉంది.


ఇవి కూడా చదవండి..

ఎయిర్‌టెల్ వినియోగదారులకు షాక్.. ప్రీపెయిడ్ ప్లాన్ ధర పెంపు..


త్వరలోనే ప్రతీకారం తీర్చుకుంటాం.. అమెరికాకు ఇరాన్ వార్నింగ్..

Updated Date - Apr 20 , 2026 | 03:58 PM