అమెరికా-ఇరాన్ చర్చలు.. స్టాక్ మార్కెట్లకు భారీ లాభాలు..
ABN , Publish Date - Apr 15 , 2026 | 03:48 PM
అమెరికా-ఇరాన్ మధ్య రెండో దఫా చర్చలు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో సూచీలు భారీ లాభాలను ఆర్జించాయి. యుద్ధం ముగింపు దశకు చేరుకుందని, ఇరాన్‌తో చర్చలు ఉంటాయని ట్రంప్ ప్రకటించడం సూచీలకు కలిసొచ్చింది.
అమెరికా-ఇరాన్ మధ్య రెండో దఫా చర్చలు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో సూచీలు భారీ లాభాలను ఆర్జించాయి. యుద్ధం ముగింపు దశకు చేరుకుందని, ఇరాన్‌తో చర్చలు ఉంటాయని ట్రంప్ ప్రకటించడం సూచీలకు కలిసొచ్చింది. ఈ నేపథ్యంలో చమురు ధరలు దిగి వచ్చాయి. మరోవైపు డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి కాస్త బలపడింది. ఈ నేపథ్యంలో దేశీయ సూచీలు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. రోజంతా లాభాల్లోనే కదలాడాయి (Indian stock market).
గత సెషన్ ముగింపు (76,847)తో పోల్చుకుంటే బుధవారం ఉదయం దాదాపు 1100 పాయింట్ల లాభంతో మొదలైన సెన్సెక్స్ రోజంతా లాభాల్లోనే కదలాడింది. మధ్యాహ్నం సమయంలో కాస్త కిందకు వచ్చినప్పటికీ తర్వాత కోలుకున్నాయి. చివరకు సెన్సెక్స్ 1263 పాయింట్ల లాభంతో 78,111 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. చివరకు 388 పాయింట్ల లాభంతో 24,231 వద్ద స్థిరపడింది (stock market news today).
సెన్సెక్స్, నిఫ్టీలో పీజీ ఎలక్ట్రోప్లాస్ట్, సుజ్లాన్ ఎనర్జీ, సీమన్స్, ఐనాక్స్ విండ్, ఏంజెల్ వన్ మొదలైన షేర్లు లాభాలు ఆర్జించాయి (share market news). ఇండస్ టవర్స్, ఆయిల్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, రెడ్డీస్ ల్యాబ్స్, డెలివరీ మొదలైన షేర్లు నష్టాలు మూటగట్టుకున్నాయి. బ్యాంక్ నిఫ్టీ 696 పాయింట్లు లాభపడింది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 1264 పాయింట్లు ఎగబాకింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 93.38గా ఉంది.
ఇవి కూడా చదవండి
ఐపీఎల్ 2026: రోహిత్ శర్మ గాయంపై కీలక అప్‌డేట్..
ఇరాన్‌తో యుద్ధం వల్ల ఎలాంటి ఉపయోగమూ లేదు.. అమెరికన్ల అభిప్రాయం ఏంటంటే..