కూల్‌డ్రింక్‌లో ఎలుక.. టిన్‌ను కోసి చూసి షాక్..
ABN , Publish Date - Apr 15 , 2026 | 02:55 PM
ప్రముఖ అంతర్జాతీయ కంపెనీకి చెందిన ఎనర్జీ డ్రింక్ కొనుగోలు చేసిన ఓ యువతికి ఊహించని షాక్ తగిలింది. ఆ ఎనర్జీ డ్రింక్‌లో చచ్చిన ఎలుక కనిపించింది.
ఇంటర్‌నెట్ డెస్క్: ఓ ప్రముఖ అంతర్జాతీయ కంపెనీకి చెందిన ఎనర్జీ డ్రింక్ కొనుగోలు చేసిన ఓ యువతికి ఊహించని షాక్ తగిలింది. ఆ ఎనర్జీ డ్రింక్‌లో చచ్చిన ఎలుక కనిపించింది. ఈ సంఘటన అమెరికాలో ఆలస్యంగా వెలుగుచూసింది. సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. అమెరికాకు చెందిన ఓ యువతి ప్రముఖ కంపెనీకి చెందిన ఎనర్జీ డ్రింక్ కొనుగోలు చేసింది. కూల్ డ్రింక్ టిన్ ఉండాల్సిన బరువుకంటే ఎక్కువ బరువు ఉండటం.. కూల్ డ్రింక్ వాసన వస్తుండటంతో యువతికి అనుమానం వచ్చింది.
అందులోని కూల్ డ్రింక్ కిందకు పారబోసింది. టిన్ లోపల చెక్ చేయగా ఏదో జీవి అందులో ఉన్నట్లు అర్థమైంది. వెంటనే కత్తితో టిన్‌ను కోసేసింది. టిన్ పైభాగాన్ని కోసి చూసి ఆ యువతి షాక్ అయింది. అందులో చచ్చిన ఎలుక కనిపించింది. కూల్‌డ్రింక్‌లో ఎక్కువ కాలం ఉండటం వల్ల అది బాగా ఉబ్బిపోయి ఉంది. ఇక, ఈ దృశ్యాలను యువతి ఫ్రెండ్ వీడియో తీసింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. కొంతమంది యువతికి మద్దతుగా నిలుస్తుంటే.. మరికొంతమంది విమర్శిస్తున్నారు.
‘ఆమెను అస్సలు నమ్మొద్దు. ఆ ఎలుక టిన్ లోపల 6 వారాలు ఉండి ఉంటే.. ఈపాటికి కుళ్లిపోయి ఉండేది’..‘ఓపెన్ చేసి ఉన్న ఆ టిన్‌లోకి ఎలుక దూరి ఉంటుంది. డ్రింక్‌లో పడి ఊపిరి ఆడక చనిపోయి ఉంటుంది. ఆమె కూల్ డ్రింక్ పారబోసి అందులో ఎలుకను చూసి ఉంటుంది’..‘నువ్వు జనాలను మోసం చేస్తున్నావు. తాగే కూల్‌డ్రింక్‌లో ఎలుక వస్తే ఎవరైనా అలా రియాక్ట్ అవుతారా? కంపెనీ వాళ్లు వన్ మిలియన్ డాలర్లకు ఆమెపై పరువు నష్టం దావా వేయండి’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
ఐపీఎల్ 2026: రోహిత్ శర్మ గాయంపై కీలక అప్‌డేట్..
ఇరాన్‌తో యుద్ధం వల్ల ఎలాంటి ఉపయోగమూ లేదు.. అమెరికన్ల అభిప్రాయం ఏంటంటే..