Share News

మొదటి త్రైమాసికంలో 7.8శాతానికి చేరిన భారత జీడీపీ

ABN , Publish Date - Aug 31 , 2026 | 05:02 PM

భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి పథంలో దూసుకెళ్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో భారత స్థూల జాతీయోత్పత్తి 7.8 శాతంగా నమోదైంది. ఈ గణాంకాలు RBI అంచనా వేసిన వృద్ధి రేటును అధిగమించడం విశేషం.

మొదటి త్రైమాసికంలో 7.8శాతానికి చేరిన భారత జీడీపీ
India GDP Grows 7.8% in Q1 FY27, Beats RBI Estimates

ఢిల్లీ, ఆగస్టు 31: భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (FY27) ఏప్రిల్-జూన్ (Q1) మొదటి త్రైమాసికానికి సంబంధించిన డేటాను ప్రభుత్వం ఇవాళ (సోమవారం) విడుదల చేసింది. భారత స్థూల జాతీయోత్పత్తి (GDP) 7.8 శాతంగా నమోదైంది. ఈ గణాంకాలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అంచనా వేసిన వృద్ధి రేటును అధిగమించడం విశేషం.


గత ఆర్థిక సంవత్సరం (FY26) ఇదే ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో భారత జీడీపీ వృద్ధి రేటు 6.9 శాతంగా ఉంది. గతేడాదితో పోలిస్తే ఈసారి ఆర్థిక పురోగతి స్పష్టమైన వేగాన్ని పుంజుకుందని ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయి.


భారత ఆర్థిక రంగానికి అనుకూలంగా ఉన్న సేవలు, తయారీ, మౌలిక వసతుల రంగాలు ఈ బలమైన వృద్ధికి ఊతమిచ్చాయని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం సవాళ్లు విసురుతున్నప్పటికీ, భారత్ అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థగా తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది.


ఇవి కూడా చదవండి...

వెలిగొండ ప్రాజెక్ట్ ఫేజ్‌-1ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు

వెలిగొండ ప్రాజెక్ట్ పూర్తి చేస్తానంటూ నమ్మించి మోసం.. జగన్‌పై ఎంపీ మాగుంట సీరియస్

Updated Date - Aug 31 , 2026 | 05:14 PM