Share News

స్థిరంగా బంగారం ధరలు, స్వల్పంగా పెరిగిన వెండి రేటు

ABN , Publish Date - May 01 , 2026 | 07:20 AM

ఇవాళ హైదరాబాద్‌తో పాటు దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. దేశంలోని ముఖ్య నగరాల్లో 24 క్యారెట్ల పది గ్రాముల పుత్తడి ధర దాదాపు రూ.1,51,000గా కొనసాగుతోంది. ఇక, వెండి రేటు కిలోకు వంద రూపాయల మేర పెరిగింది.

స్థిరంగా బంగారం ధరలు, స్వల్పంగా పెరిగిన వెండి రేటు
Gold and Silver updates

ఆంధ్రజ్యోతి, మే 1: ఇవాళ హైదరాబాద్‌తో పాటు దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న పరిణామాల ప్రభావం దేశీయ ధరలపై కనిపిస్తోంది. ముఖ్య నగరాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు దాదాపు రూ.1,51,000 ఉండగా, 22 క్యారెట్ల పది గ్రాముల పుత్తడి ధర దాదాపు రూ.1,38,000గా కొనసాగుతోంది.

నేడు దేశవ్యాప్తంగా బంగారం ధరల్లో గ్రాముకు రూ.1 చొప్పున స్వల్ప పెరుగుదల నమోదైంది. 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) రూ.1,50,670 (నిన్నటి కంటే రూ.10 పెరిగింది). 22 క్యారెట్ల బంగారం(10 గ్రాములకు)పైనా అదే స్థాయిలో పెరిగి రూ.1,38,110కు చేరింది. 18 క్యారెట్ల పసిడిపై కూడా రూ.10 మేర పెరిగి.. రూ.1,13,000కు చేరింది.


ముఖ్య నగరాల్లో నేటి ధరల వివరాలు (10 గ్రాములకు):

  • హైదరాబాద్: రూ.1, 50, 670 (24 క్యారెట్లు), రూ.1,38,110 (22 క్యారెట్లు)

  • విజయవాడ: రూ.1,50,670 (24 క్యారెట్లు), రూ.1,38,110 (22 క్యారెట్లు)

  • చెన్నై: రూ.1,53,830 (24 క్యారెట్లు), రూ.1,41,010 (22 క్యారెట్లు)

  • ముంబై: రూ.1,50,670 (24 క్యారెట్లు), రూ.1,38,110 (22 క్యారెట్లు)

  • బెంగళూరు: రూ.1,50,670 (24 క్యారెట్లు), రూ.1,38,110 (22 క్యారెట్లు)

  • ఢిల్లీ: రూ.1,50,820 (24 క్యారెట్లు), రూ.1,38,260 (22 క్యారెట్లు)


స్వల్పంగా పెరిగిన వెండి ధరలు.. నేటి రేట్లివే..

దేశీయ మార్కెట్‌లో వెండి ధరలు కూడా నేడు స్వల్పంగా పెరిగాయి. మే 1, 2026 నాటికి వెండి ధరలో కిలోకు రూ.100 మేర పెరిగి.. రూ.2,70,100కు చేరింది. దేశంలోని వివిధ నగరాల్లో పన్నులు, స్థానిక రవాణా ఛార్జీల కారణంగా ధరల్లో స్వల్ప వ్యత్యాసాలు ఉంటాయి.


ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కిలోకు):

  • హైదరాబాద్: రూ.2,70,100

  • చెన్నై: రూ.2,70,100

  • ముంబై: రూ.2,49,900

  • ఢిల్లీ: రూ.2,49,900

  • బెంగళూరు: రూ.2,49,900

  • కోల్‌కతా: రూ.2,49,900

హైదరాబాద్, చెన్నై, కేరళ వంటి ప్రాంతాల్లో వెండి ధర మిగిలిన నగరాల కంటే కాస్త ఎక్కువగా ఉంది. కిలో వెండి అక్కడ రూ.2,70,100 వద్ద కొనసాగుతుండగా, ముంబై, ఢిల్లీ వంటి నగరాల్లో రూ. 2,49,900 వద్ద ఉంది.

గమనిక: ఈ ధరలు సమాచారం కోసం మాత్రమే. కొనుగోలు చేసే సమయంలో జీఎస్టీ (GST), ఇతర ఛార్జీలు, స్థానిక మార్కెట్ల ప్రకారం ధరల్లో మార్పులు ఉండే అవకాశం ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి:

నేను సీఎం కావాలన్నా.. కుర్చీ ఖాళీగా లేదు

జీవితంలో ఓడి... పదిలో గెలిచిన వర్షిత..

Read Latest Telangana News and National News

Updated Date - May 01 , 2026 | 07:54 AM