Share News

బంగారం, వెండి ధరల్లో తగ్గుదల.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

ABN , Publish Date - Jun 17 , 2026 | 11:04 AM

బుధవారం నాడు బంగారం ధరల్లో తగ్గుదల నమోదైంది. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ కారణాల నేపథ్యంలో బంగారం ధరలు హెచ్చు తగ్గులకు లోనవుతున్నాయి. బుధవారం ఉదయం 10:30 గంటల సమయంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..

బంగారం, వెండి ధరల్లో తగ్గుదల.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
Gold Silver Price

ఇంటర్నెట్ డెస్క్: బుధవారం నాడు బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల నమోదైంది. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ కారణాల నేపథ్యంలో బంగారం ధరలు హెచ్చు తగ్గులకు లోనవుతున్నాయి. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గడం, డాలర్ బలపడడం మొదలైన కారణాలతో పసిడి ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. (Gold and Silver Rates).


గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, బుధవారం ఉదయం 10:30 గంటల సమయంలో హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,51,100గా ఉంది. ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,38,500గా ఉంది. మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,51,250గా ఉంది. ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,38,650గా ఉంది. (Gold Rate live).


మరోవైపు వెండి ధరలు కూడా తగ్గుదలను నమోదు చేశాయి (Silver prices today). కిలోకు 2650 రూపాయల మేర తగ్గాయి. ప్రస్తుతం హైదరాబాద్‌, విజయవాడలో కిలో వెండి ధర రూ.2,75,000గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2,65,000గా ఉంది. అలాగే చెన్నైలో కిలో వెండి ధర రూ.2,75,000గా, బెంగళూరులో రూ.2,65,000గా ఉంది.

గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలను చెక్ చేసుకోవలసిందిగా సూచన.


ఇవి కూడా చదవండి..

మస్క్ సంపద ఎంతంటే.. గంటకు రూ. 9.5 కోట్ల చొప్పున 114 ఏళ్లు ఖర్చుపెట్టినా తరగదు..


సూచీలకు కొనుగోళ్ల అండ.. వరుసగా మూడో రోజూ లాభాల్లోనే..

Updated Date - Jun 17 , 2026 | 11:05 AM