మస్క్ సంపద ఎంతంటే.. గంటకు రూ. 9.5 కోట్ల చొప్పున 114 ఏళ్లు ఖర్చుపెట్టినా తరగదు..
ABN , Publish Date - Jun 17 , 2026 | 09:46 AM
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఈ భూమండలంపై ఒక కొత్త ఆర్థిక చరిత్రను లిఖించారు. కలలో కూడా ఊహించలేని సంపదను పోగేసుకున్నారు. స్పేస్‌ఎక్స్ మార్కెట్ అరంగేట్రం విజయవంతం కావడంతో ఆయన వ్యక్తిగత సంపద ఒక ట్రిలియన్ డాలర్లను దాటేసింది.
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఈ భూమండలంపై ఒక కొత్త ఆర్థిక చరిత్రను లిఖించారు. కలలో కూడా ఊహించలేని సంపదను పోగేసుకున్నారు. స్పేస్‌ఎక్స్ మార్కెట్ అరంగేట్రం విజయవంతం కావడంతో ఆయన వ్యక్తిగత సంపద ఒక ట్రిలియన్ డాలర్లను దాటేసింది. దీంతో ప్రపంచ చరిత్రలో తొలి ట్రిలియనీర్‌గా మస్క్ కొత్త రికార్డు సృష్టించారు. ఫోర్బ్స్ అంచనాల ప్రకారం ఆయన నికర సంపద 1.26 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. అంటే మన కరెన్సీలో రూ.కోటి కోట్లకు పైమాటే (Elon Musk trillionaire).
ఒక ట్రిలియన్ డాలర్లు అంటే 1 తర్వాత 12 సున్నాలు ఉంటాయి. మస్క్ ఇప్పటి నుంచి రాబోయే 114 ఏళ్ల పాటు ప్రతి గంటకు మిలియన్ డాలర్ల (రూ.9.45 కోట్లు) చొప్పున ఖర్చుపెట్టినా ఆయన సంపద ఇంకా మిగిలే ఉంటుంది. ఈ మొత్తాన్ని ఈ భూమి మీద ఉన్న 820 కోట్ల మందికి పంచితే.. ఒక్కొక్కరికి రూ.11 వేలకు పైనే అందుతాయి.
అమెరికాలో ప్రస్తుతం ఒక ఇంటి సగటు ధర ఆధారంగా చూస్తే, 1 ట్రిలియన్ డాలర్లతో సుమారు 25 లక్షల ఇళ్లను కొనుగోలు చేయవచ్చు. ఇది అనేక దేశాల మొత్తం గృహ మార్కెట్ విలువతో సమానం. ఒక ట్రిలియన్ డాలర్లు అనేది మస్క్ స్వదేశమైన దక్షిణాఫ్రికా వార్షిక జీడీపీకి రెట్టింపు కంటే ఎక్కువ (Elon Musk net worth).
ఒక ట్రిలియన్ అమెరికన్ డాలర్ల నోట్లను ఒకదాని చివర మరొకటి కలిపి పేర్చితే అవి దాదాపు 97 మిలియన్ మైళ్ల దూరం వరకు విస్తరిస్తాయి (Trillion dollars). ఇది చంద్రుడి పైకి 200 కంటే ఎక్కువ సార్లు వెళ్లి రావడానికి పట్టే దూరానికి సమానం. ఇక, మస్క్ వ్యక్తిగత సంపద ఈ ప్రపంచంలో దాదాపు 170 దేశాల వార్షిక జీడీపీ కంటే చాలా ఎక్కువ. ప్రస్తుతం 21 దేశాల జీడీపీ మాత్రమే ట్రిలియన్ డాలర్ల మార్కును దాటింది.
ఈ వార్తలనూ చదవండి:
జపాన్ జనాల పద్ధతే వేరు.. ప్రపంచం ఫిదా
ఒక బాయ్‌ఫ్రెండ్‌గా నాకు కొన్ని బాధ్యతలు తప్పవు.. జస్టిన్ ట్రూడో