సూచీలకు కొనుగోళ్ల అండ.. వరుసగా మూడో రోజూ లాభాల్లోనే..
ABN , Publish Date - Jun 17 , 2026 | 10:07 AM
వరుసగా రెండ్రోజులు లాభాల్లో కదలాడిన దేశీయ సూచీలు బుధవారం కూడా సానుకూలంగానే మొదలయ్యాయి. పశ్చిమాసియాలో తిరిగి శాంతి నెలకొనడం, హోర్ముజ్ నుంచి చమురు సరఫరా సజావుగా సాగడానికి మార్గం సుగమం కావడం అంతర్జాతీయ మార్కెట్లలో జోష్ నింపింది.
వరుసగా రెండ్రోజులు లాభాల్లో కదలాడిన దేశీయ సూచీలు బుధవారం కూడా సానుకూలంగానే మొదలయ్యాయి. పశ్చిమాసియాలో తిరిగి శాంతి నెలకొనడం, హోర్ముజ్ నుంచి చమురు సరఫరా సజావుగా సాగడానికి మార్గం సుగమం కావడం అంతర్జాతీయ మార్కెట్లలో జోష్ నింపింది. క్రూడాయిల్ ధరలు తగ్గుముఖం పట్టడం, మరోవైపు డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి (94.32) బలపడడం దేశీయ సూచీలకు సానుకూలంగా మారింది. ఈ నేపథ్యంలో సెన్సెక్స్, నిఫ్టీ వరుసగా మూడో రోజు కూడా లాభాల్లో కదలాడుతున్నాయి (Indian stock market).
గత సెషన్ ముగింపు (76,808)తో పోల్చుకుంటే బుధవారం ఉదయం దాదాపు 200 పాయింట్ల లాభంతో మొదలైన సెన్సెక్స్ అదే జోరు కొనసాగిస్తోంది. ఉదయం 10:00 గంటల సమయంలో సెన్సెక్స్ 251 పాయింట్ల లాభంతో 77,059 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే సాగుతోంది. ప్రస్తుతం 76 పాయింట్ల లాభంతో 24,065 వద్ద కదలాడుతోంది (stock market news today).
సెన్సెక్స్, నిఫ్టీలో బ్లూస్టార్, డిక్సన్ టెక్నాలజీస్, వోల్టాస్, ట్రెంట్, సీజీ కన్జ్యూమర్ మొదలైన షేర్లు లాభాల్లో ఉన్నాయి (share market news). లోథా డెవలపర్స్, ఒబెరాయ్ రియాల్టీ, సమ్మన్ క్యాపిటల్, సుప్రీమ్ ఇండస్ట్రీస్, ఫోర్టిస్ హెల్త్ మొదలైన షేర్లు నష్టాల బాటలో సాగుతున్నాయి. బ్యాంక్ నిఫ్టీ 30 పాయింట్ల లాభంతో ఉంది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 218 పాయింట్లు ఆర్జించింది.
ఈ వార్తలనూ చదవండి:
జపాన్ జనాల పద్ధతే వేరు.. ప్రపంచం ఫిదా
ఒక బాయ్‌ఫ్రెండ్‌గా నాకు కొన్ని బాధ్యతలు తప్పవు.. జస్టిన్ ట్రూడో