Share News

బ్లాక్‌ ఫ్రైడే!

ABN , Publish Date - Nov 28 , 2026 | 12:57 AM

ఐటీ, బ్యాంకింగ్‌ రంగ షేర్లలో ఇన్వెస్టర్లు పెద్దఎత్తున లాభాల స్వీకరణకు పాల్పడటంతో భారత స్టాక్‌ మార్కెట్‌ ప్రామాణిక సూచీలు శుక్రవారం భారీగా నష్టపోయాయి.

బ్లాక్‌ ఫ్రైడే!
bull

  • సెన్సెక్స్‌ 989 పాయింట్లు పతనం

ముంబై: ఐటీ, బ్యాంకింగ్‌ రంగ షేర్లలో ఇన్వెస్టర్లు పెద్దఎత్తున లాభాల స్వీకరణకు పాల్పడటంతో భారత స్టాక్‌ మార్కెట్‌ ప్రామాణిక సూచీలు శుక్రవారం భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్‌ 989.33 పాయింట్లు (1.17 శాతం) క్షీణించి 83,339.26 వద్దకు జారుకుంది. నిఫ్టీ 277.30 పాయింట్లు (1.07 శాతం) పతనమై 25,607.20 వద్ద ముగిసింది. ఈక్విటీ ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ రూ.94,000 కోట్లు తగ్గి రూ.513.11 లక్షల కోట్లకు జారుకుంది. సెన్సెక్స్‌లోని 30 నమోదిత కంపెనీల్లో 24 నష్టపోగా.. హెచ్‌సీఎల్‌ టెక్‌, టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, టెక్‌ మహీంద్రా షేర్లు 2.81 శాతం వరకు క్షీణించి సూచీ టాప్‌ లూజర్లుగా మిగిలాయి.

రూపాయి.. 62 పైసలు డౌన్‌

భారత కరెన్సీ మళ్లీ కుంగింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఏకంగా 62 పైసలు తగ్గి రూ.93 వద్ద ముగిసింది. అంతర్జాతీయ కరెన్సీలతో పోలిస్తే డాలర్‌ బలపడటం, ముడిచమురు ధరల పెరగుదల, ఈక్విటీ మార్కెట్లో నష్టాలు ఇందుకు కారణమయ్యాయి. కాగా, అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ ముడిచమురు పీపా ధర మళ్లీ 96 డాలర్ల స్థాయికి ఎగబాకింది.


సిల్వర్‌ రూ.13,500 అప్‌

దేశీయంగా విలువైన లోహాల ధరలు భారీగా పెరిగాయి. ఢిల్లీ మార్కెట్లో మేలిమి (99.9 శాతం స్వచ్ఛత) బంగారం ధర రూ.3,100 పెరిగి రూ.1,30,600కు చేరుకుంది. కిలో వెండి ఏకంగా రూ.13,500 (9 శాతం) ఎగబాకి రూ.1,63,500కు చేరింది. అంతర్జాతీయంగా వీటి ధర లు పెరగడంతోపాటు రూపాయి క్షీణత ఇందుకు కారణం. ఇంటర్నేషనల్‌ స్పాట్‌ మార్కెట్లో ఔన్స్‌ (31.10 గ్రాములు) గోల్డ్‌ రేటు 105.22 డాలర్లు పెరిగి 3,672 డాలర్లకు చేరగా.. సిల్వర్‌ 7 శాతం ఎగబాకి 43.97 డాలర్ల స్థాయిలో ట్రేడైంది.

వి కూడా చదవండి:

అవన్నీ పట్టించుకోవడం మానేశా.. టీమిండియాలోకి రీఎంట్రీపై షమీ ఆసక్తికర వ్యాఖ్యలు

కివీస్‌తో రెండో టెస్టు.. జడేజాను ఎందుకు పక్కన పెట్టారు?: గావస్కర్

Updated Date - Nov 28 , 2026 | 12:58 AM