Share News

భారీగా పతనమైన బిట్‌ కాయిన్ విలువ.. రెండేళ్లలో ఇదే తొలిసారి

ABN , Publish Date - Nov 21 , 2026 | 02:31 PM

ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టో కరెన్సీ అయిన బిట్ కాయిన్ (డిజిటల్ కరెన్సీ) విలువ 56 వేల డాలర్లకు పడిపోయింది. ఇంత భారీ స్థాయిలో దీని విలువ పతనం అవ్వడం రెండేళ్లలో ఇదే తొలిసారి.

భారీగా పతనమైన బిట్‌ కాయిన్ విలువ.. రెండేళ్లలో ఇదే తొలిసారి
bitcoin price falls

బిజినెస్ డిస్క్: ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ కరెన్సీ అయిన బిట్ కాయిన్ విలువ భారీగా తగ్గింది. రెండేళ్ల తరువాత తొలిసారిగా 56 వేల డాలర్లకు కుప్పకూలింది.


క్రిప్టో కరెన్సీ అయిన బిట్ కాయిన్ విలువ అంతర్జాతీయ స్థాయిలో భారీగా తగ్గింది. 2024 సెప్టెంబర్‌లో తొలిసారిగా భారీ స్థాయిలో 55,533 డాలర్లకు తగ్గిన దీని విలువ మళ్లీ రెండేళ్ల తరువాత.. ప్రస్తుతం అదే స్థాయిలో తగ్గిపోయింది. 2024 సెప్టెంబర్ తరువాత దీని విలువ నెమ్మదిగా పురోగమిస్తూ 2025 అక్టోబర్ నాటికి గరిష్ఠంగా 1,26,000 డాలర్లకు చేరుకోగా.. ప్రస్తుతం దీని విలువ సగానికి సగానికి సగం పడిపోయింది. ఇంత భారీ స్థాయిలో బిట్ కాయిన్ విలువ తగ్గిపోవడం రెండేళ్లలో ఇదే తొలిసారి. ఏఐ స్టాక్స్‌పై ఆందోళనలు ఉన్న నేపథ్యంలో వడ్డీ రేట్లు పెరుగుతాయన్న భయంతో క్రిప్టో ఈటీఎఫ్‌ల నుంచి పెట్టుబడుల ఉపసంహరణల కారణంగానే.. బిట్ కాయిన్ కరెన్సీ విలువ సగానికి సగం పడిపోయిందని నిపుణులు అంచనా వేస్తున్నారు.


ఈ వార్తలనూ చదవండి:

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్‌పై సైబర్ దాడి.. కస్టమర్ల సమాచారం లీక్!

ఆపరేషన్ మిడ్‌నైట్ హ్యామర్.. 37 గంటల మిషన్‌లో ఏం జరిగిందంటే..

Updated Date - Nov 21 , 2026 | 02:35 PM