జులైలో బ్యాంకు సెలవులు ఇవే..
ABN , Publish Date - Jun 30 , 2026 | 09:31 AM
జూన్ మాసం నేటితో ముగియనుంది. మరికొన్ని గంటల్లో జులై మాసం ప్రారంభం కానుంది.
హైదరాబాద్/అమరావతి, జూన్ 30: జూన్ మాసం నేటితో ముగియనుంది. మరికొన్ని గంటల్లో జులై మాసం ప్రారంభం కానుంది. జులైలో పండగలు లేవు. దాంతో బ్యాంకు సెలవులు కొన్ని మాత్రమే ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) మార్గదర్శకాల ప్రకారం జులైలో సెలవులను ఒకసారి పరిశీలిస్తే.. ఆదివారాలతోపాటు రెండు, నాలుగు శనివారాలు బ్యాంకులు మూసి ఉంటాయి.
ఈ సెలవుల కారణంగా బ్యాంకు సేవలు అందుబాటులో ఉండవు. దీంతో డిజిటల్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉంటాయి. ఇంటర్నెట్, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ, డెబిట్, క్రెడిట్ కార్డులు పని చేస్తాయి. అలాగే ఏటీఎం సేవలు సాధారణంగా పని చేస్తాయని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. మిగిలిన అన్ని సాధారణ పని దినాల్లో బ్యాంకులు యథావిధిగా పనిచేస్తాయి.
2026, జూన్ నెలలో సెలవులు..
జులై 5: ఆదివారం.
జులై11: రెండో శనివారం.
జులై12: ఆదివారం.
జులై 19: ఆదివారం.
జులై 25: నాలుగో శనివారం.
జులై 26: ఆదివారం.
ఈ వార్తలు కూడా చదవండి..
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ చైర్మన్‌గా రాజీవ్ కుమార్
నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన రహదారి.. భారీగా నిలిచిన పర్యాటకుల వాహనాలు
For More Business News And Telugu News