Share News

ఎయిర్‌టెల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. అడోబ్‌ ఎక్స్‌ప్రెస్‌ ఏడాది ఫ్రీ

ABN , Publish Date - Oct 13 , 2026 | 07:52 PM

ప్రముఖ టెలికాం సంస్థ భారతి ఎయిర్‌టెల్ కొత్తగా రూ.348 ప్రీపెయిడ్ ప్లాన్‌ను తీసుకువచ్చింది. 28 రోజుల వ్యాలిడిటీ కలిగిన ఈ ప్లాన్‌లో అపరిమిత కాలింగ్, రోజుకు 2జీబీ డేటా, 100 ఎస్సెమ్మెస్‌లు లభిస్తాయి.

ఎయిర్‌టెల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. అడోబ్‌ ఎక్స్‌ప్రెస్‌ ఏడాది ఫ్రీ
Airtel 348 Recharge Plan

ఇంటర్నెట్‌ డెస్క్: దేశంలోని ప్రముఖ టెలికాం కంపెనీ ఒకరైన భారతి ఎయిర్‌టెల్ తన వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు ఆకర్షణీయమైన రీఛార్జ్ ఆఫర్లను ప్రవేశపెడుతోంది. తాజాగా ప్రీపెయిడ్ వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని కొత్త ప్లాన్‌ను ఎయిర్‌టెల్ తీసుకొచ్చింది. 28 రోజుల వ్యాలిడిటీతో రూ.348 ప్లాన్‌ను విడుదల చేసింది. ఈ కొత్త ప్లాన్ ప్రకారం.. రోజుకు 2 జీబీ డేటా, 100 ఎస్సెమ్మెస్‌లు, అపరిమిత కాల్స్‌ లభిస్తాయి. అలానే రూ.348 ప్లాన్‌తో అడోబ్ ఎక్స్‌ప్రెస్‌ ప్రీమియం ఏడాది పాటు ఉచితంగా పొందొచ్చు. దీంతో వినియోగదారులకు రూ.4 వేల వరకు ఆదా అవుతుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు.


ఈ ప్లాన్ ద్వారా స్పామ్‌ కాల్ అలర్ట్‌, ఫ్రాడ్‌ లింక్స్‌ బ్లాక్‌ వంటి సదుపాయాలు లభిస్తాయని ఎయిర్‌టెల్‌ పేర్కొంది. 30 రోజుల పాటు ఫ్రీ హలోట్యూన్స్‌ సదుపాయం కూడా ఉంది. ఎయిర్‌టెల్‌లో రూ.349కు మరో ప్రీపెయిడ్‌ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో అపరిమిత వాయిస్‌ కాల్స్‌, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు, అపరిమిత 5జీ డేటా లభిస్తుంది. ఈ ప్లాన్‌తో అడోబ్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రీమియం, యాపిల్‌ మ్యూజిక్‌ ఆరు నెలల పాటు ఉచితంగా లభిస్తుంది.


అయితే, రూ.349లో 5జీ డేటా లభిస్తుండగా.. రూ.348లో మాత్రం 4జీ డేటా మాత్రమే లభిస్తుంది. కాబట్టి 5జీ కనెక్షన్ అవసరం లేకుండా, కేవలం 4జీ నెట్‌వర్క్‌పై ఎక్కువగా ఆధారపడుతూ రోజువారీగా ఎక్కువ డేటా కావాలనుకునే వారికి రూ.348 ప్లాన్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ ప్లాన్ ప్రకారం వినియోగదారునికి రోజువారీ ఖర్చు కేవలం రూ.12.43 మాత్రమే పడుతుందని టెక్ నిపుణులు చెబుతున్నారు.


ఇవి కూడా చదవండి:

క్షణాల్లో చేతులతోనే ఇనుప పెనాన్ని చుట్టేశాడు.. వీడియో వైరల్

నాసా–స్పేస్‌ఎక్స్ ప్రయోగం సక్సెస్.. ISSకు 2,800 కేజీల సరుకులతో డ్రాగన్ నౌక

వాదిస్తే నిజాలు అబద్ధాలు కావు.. లద్దాఖ్‌పై చైనాకు భారత్ కౌంటర్

Updated Date - Oct 13 , 2026 | 08:07 PM