Share News

Vastu Dosham Remedies: ఇంట్లో ఈ లక్షణాలు కనిపిస్తే వాస్తు దోషం ఉన్నట్టే..

ABN , Publish Date - Jan 10 , 2026 | 09:18 AM

ఇంట్లో ప్రశాంతతతో పాటూ సుఖసంతోషాలు నింపడంలో వాస్తు కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. కానీ చాలాసార్లు మనకు తెలీకుండా చేసే చిన్న తప్పులు ఇంట్లో వాస్తు దోషాలకు కారణమవుతాయట..

Vastu Dosham Remedies: ఇంట్లో ఈ లక్షణాలు కనిపిస్తే వాస్తు దోషం ఉన్నట్టే..
Vastu Dosham Remedies

ఇంటర్నెట్ డెస్క్: వాస్తు శాస్త్రం ప్రకారం మన జీవితంపై ఇల్లు నేరుగా ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇల్లు సరిగా నిర్మించకపోతే లేదా వాస్తు నియమాలు పాటించకపోతే, ఇంట్లో ప్రతికూల శక్తి పెరిగి అనేక సమస్యలు ఎదురవుతాయని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు. చాలా మంది తెలీకుండా చేసే చిన్న చిన్న తప్పులు.. చివరకు వాస్తు దోషాలకు కారణమవుతాయట. ఇంట్లో ఈ లక్షణాలు కనిపిస్తే వాస్తు దోషం ఉన్నట్టేనని నిపుణులు చెబుతున్నారు.


ఇంట్లో వాస్తు దోషాల లక్షణాలు..

  • ఇంట్లో ఎలాంటి కారణం లేకుండా ఎప్పుడూ ఒత్తిడి, బాధ, అసంతృప్తి ఉండటం.

  • ఎంత కష్టపడినా పనుల్లో విజయం లేకపోవడం.

  • తరచూ ఆరోగ్య సమస్యలు, అనారోగ్యానికి గురవడం.

  • డబ్బు సమస్యలు, ఖర్చులు పెరగడం, ఆదాయం నిలకడగా లేకపోవడం.

  • కొళాయి లీక్ అవుతుండడం – ఇది ఆర్థిక నష్టానికి సంకేతంగా చెబుతారు.

  • ఈశాన్య మూలలో టాయిలెట్ ఉండటం.

  • ఇంట్లో కొన్ని మూలల్లో వెలుతురు లేక చీకటిగా ఉండటం.

  • ఇంటి చుట్టూ, ప్రధాన ద్వారం దగ్గర చెత్త చిందరవందరగా ఉండటం.

  • ఇలాంటి లక్షణాలు ఉంటే వాస్తు దోషం ఉన్నట్టేనని భావిస్తారు.


వాస్తు దోషాలను తొలగించే సులభమైన చిట్కాలు..

  • ఇంట్లో వాస్తు శాంతి పూజ చేయించండి.

  • రోజూ లేదా సాయంత్రం సమయాల్లో ధూపం కాల్చి ఇంటి చుట్టూ తిప్పండి.

  • సాయంత్రం ప్రధాన ద్వారం దగ్గర, తులసి మొక్క వద్ద నెయ్యి దీపం వెలిగించండి

  • ఇంటిని ఎప్పుడూ శుభ్రంగా.. గాలి, వెలుతురు వచ్చేలా ఉంచండి.

  • పాత, పనికిరాని వస్తువులు తొలగించి ఇల్లు శుభ్రంగా ఉంచండి.

  • ఈ విధంగా చేస్తే ఇంట్లోని ప్రతికూల శక్తి తొలగిపోయి సానుకూల శక్తి పెరుగుతుందని వాస్తు శాస్త్రం చెబుతోంది.


(Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ఇది కేవలం మీ అవగాహన కోసమే.. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించలేదు)

Also Read:

తిన్న వెంటనే నీళ్లు తాగితే ఏమవుతుంది?

జామపండును తొక్కతో తినాలా? లేక తీసేసి తినాలా?

For More Latest News

Updated Date - Jan 10 , 2026 | 10:24 AM