ఐఏఎస్ అధికారుల బదిలీల్లో కీలక పరిణామం.. ఎట్టకేలకు శ్రీలక్ష్మికి పోస్టింగ్
ABN , Publish Date - Jun 25 , 2026 | 05:16 PM
ఆంధ్రప్రదేశ్‌లో ఐఏఎస్ అధికారుల బదిలీల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీనియర్ ఐఏఎస్ అధికారి వై. శ్రీలక్ష్మికి ఎట్టకేలకు ప్రభుత్వం కీలక పోస్టింగ్ ఇచ్చింది..
అమరావతి, జూన్ 25: ఐఏఎస్ అధికారుల బదిలీల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీనియర్ ఐఏఎస్ అధికారి వై. శ్రీలక్ష్మికి ఎట్టకేలకు ప్రభుత్వం కీలక పోస్టింగ్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ సాధారణ పరిపాలన (జీపీఎం అండ్ ఏఆర్) శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఆమెను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్ అధికారిక జీవోను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ బాధ్యతలను అదనపు ఇన్‌చార్జిగా నిర్వహిస్తున్న శంషేర్ సింగ్ రావత్ నుంచి వై. శ్రీలక్ష్మికి అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో సాధారణ పరిపాలన శాఖలో కీలక పరిపాలనా బాధ్యతలు ఇకపై ఆమె పర్యవేక్షణలో కొనసాగనున్నాయి.
వై. శ్రీలక్ష్మి సుదీర్ఘ అనుభవం కలిగిన సీనియర్ ఐఏఎస్ అధికారిణిగా గుర్తింపు పొందారు. ఆమెకు కీలక శాఖల్లో పనిచేసిన అనుభవం ఉంది. తాజాగా ప్రభుత్వం ఆమెకు జనరల్ అడ్మినిస్ట్రేషన్ (GPM&AR) శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ బాధ్యతలను అప్పగించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని జీవోలో పేర్కొంది.
ఇవి కూడా చదవండి
సంపులో పడి చిన్నారి మృతి.. తట్టుకోలేక నాయనమ్మ కన్నుమూత!
టీమిండియాతోనే పయనం.. కానీ మ్యాచ్‌కు ముందు వైభవ్‌కు ప్రత్యేక రూమ్!