TDP vs YSRCP: గుడివాడలో దారుణం.. టీడీపీ నేతపై అటాక్..
ABN , Publish Date - Jan 02 , 2026 | 04:20 PM
గుడివాడలోని గుడ్‌మేన్ పేటలో టీడీపీ నేతపై హత్యాయత్నం జరిగింది. దీంతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గుడ్‌మేన్ పేట సెంటర్‌లో టిడిపి నేత ఇమ్మాన్యూయెల్‌పై కత్తులు, రాళ్లతో మూకుమ్మడి దాడి చేశారు..
కృష్ణా, జనవరి 2: గుడివాడలోని గుడ్‌మేన్ పేటలో టీడీపీ నేతపై హత్యాయత్నం జరిగింది. దీంతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గుడ్‌మేన్ పేట సెంటర్‌లో టిడిపి నేత ఇమ్మాన్యూయెల్‌పై కత్తులు, రాళ్లతో మూకుమ్మడి దాడి చేశారు వైసీపీ వర్గీయులు. ఇమ్మాన్యూయెల్‌ను చంపేందుకు ప్రయత్నిస్తుండగా.. స్థానికులు అడ్డుకున్నారు. దీంతో వారిపైనా వైసీపీ వర్గీయులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఇమ్మాన్యూయెల్‌తో సహా మరో ఇద్దరికి స్వల్ప గాయాలు అయ్యాయి. స్థానికులు పెద్ద ఎత్తున ఘటనా స్థలికి రావడంతో వైసీపీ వర్గీయులు పారిపోయారు. గాయపడిన వారిని హుటాహుటిన గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు.
గత రాత్రి నూతన సంవత్సర వేడుకల్లో వైసీపీ నేత రాజేష్‌తో స్వల్ప ఘర్షణ జరిగింది. దీనికి కొనసాగింపుగా ఈ దాడి జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన గుడివాడ టూ టౌన్ పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. విషయం తెలుసుకున్న కూటమి పార్టీల నాయకులు బాధితులను పరామర్శించారు. మరోవైపు హాస్పిటల్ ప్రాంగణానికి గుడ్‌మేన్ పేట వాసులు భారీగా చేరుకున్నారు.
ప్రాణహానీ..
వైసీపీ నాయకుల నుండి తనకు ప్రాణహాని ఉందని టీడీపీ నేత ఇమ్మాన్యూయెల్ ఆవేదన వ్యక్తం చేశారు. 15 మంది వరకు తనపై దాడి చేశారన్నారు. వైసీపీ నేతలు రాజేష్, ఎలీషా ప్రోత్బలంతోనే ఈ దాడి జరిగిందని ఆరోపించారు. స్థానికులు స్పందించి అడ్డుకోకుంటే ఇమ్మాన్యూయెల్‌ను చంపేసేవారని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.
Also Read:
S Jaishankar: మన పొరుగున చెడ్డోళ్లున్నారు.. పాక్‌పై జైశంకర్ పంజా
Pawan Kalyan Visit Kondagattu Temple: రేపు కొండగట్టు క్షేత్రానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్