మహిళలకు చీరలు పంపిణీ చేస్తూ...
ABN , Publish Date - Oct 26 , 2026 | 05:40 AM
స్థానిక ఎన్నికల్లో ప్రలోభాల పర్వం మొదలైంది. పార్వతీపురం మన్యం జిల్లాలో మహిళా ఓటర్లకు చీరలు పంపిణీ చేస్తూ వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థి భర్త అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. ఆదివారం కొమరాడ మండలం శివిని గ్రామంలో చర్చి సమీపంలో విక్రంపురం వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థి కలిశెట్టి వాసవి భర్త సిరిపురం అనిల్ మహిళా ఓటర్లకు చీరలు పంపిణీ చేశారు.
దొరికిపోయిన వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థి భర్త
కొమరాడ, అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి): స్థానిక ఎన్నికల్లో ప్రలోభాల పర్వం మొదలైంది. పార్వతీపురం మన్యం జిల్లాలో మహిళా ఓటర్లకు చీరలు పంపిణీ చేస్తూ వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థి భర్త అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. ఆదివారం కొమరాడ మండలం శివిని గ్రామంలో చర్చి సమీపంలో విక్రంపురం వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థి కలిశెట్టి వాసవి భర్త సిరిపురం అనిల్ మహిళా ఓటర్లకు చీరలు పంపిణీ చేశారు. స్థానిక అధికారులు, ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్‌కు సమాచారం అందడంతో పోలీసుల సాయంతో అక్కడికి చేరుకున్నారు. మహిళా ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు యత్నించిన అనిల్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కారు, అందులో ఉన్న 104 చీరలను స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్‌ను కూడా పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
ఈ వార్తలనూ చదవండి:
అర్నాబ్ తుఫాన్‌పై సీఎం చంద్రబాబు హై అలర్ట్.. ముందస్తు చర్యలకు ఆదేశం