Share News

పోలవరంలో విషాదం.. నిప్పంటించుకుని యువతి ఆత్మహత్య

ABN , Publish Date - Sep 13 , 2026 | 09:07 PM

పోలవరం జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రేమించిన వ్యక్తి కోసం ఓ యువతి నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

పోలవరంలో విషాదం.. నిప్పంటించుకుని యువతి ఆత్మహత్య
young women death in ap

పోలవరం, సెప్టెంబర్ 13: ప్రేమించిన వ్యక్తి తనకు దక్కడేమో అన్న బెంగతో ఓ యువతి ప్రాణాలు తీసుకుంది. ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది. తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ విషాద ఘటన పోలవరం జిల్లా, దేవీపట్నం మండలంలోని దామనపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.


కుటుంబసభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతురాలు ఓ వ్యక్తిని ప్రేమించింది. అయితే, అదే వ్యక్తిని మరో అమ్మాయి కూడా ప్రేమించింది. ఈ నేపథ్యంలో ప్రేమించిన వ్యక్తి కోసం ఇద్దరు అమ్మాయిలు గొడవ పడ్డారు. ఈ ఘర్షణ తరువాత ప్రేమించిన అబ్బాయి తనకు దక్కడేమో అని కలత చెంది ప్రాణాలు తీసుకోవడానికి సిద్దపడింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది.


యువతి అరుపులు విన్న స్థానికులు అక్కడికి చేరుకుని కాపాడే ప్రయత్నం చేశారు. కానీ, అప్పటికే ఎక్కువ శాతం శరీరం కాలిపోవడంతో ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న దేవీపట్నం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు.


ఈ వార్తలు కూడా చదవండి

నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడొద్దు జగన్: హోంమంత్రి అనిత..

డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాల్లో అక్రమాలు జరగలేదు: ఏపీ జూడో అసోసియేషన్

Updated Date - Sep 13 , 2026 | 09:44 PM