ఎవరీ పూల సుబ్బయ్య?
ABN , Publish Date - Sep 01 , 2026 | 04:23 AM
వెలిగొండ ప్రాజెక్టుకు పూల సుబ్బయ్య పేరుపెట్టడం, సభా వేదికపై ఆయన కుమార్తెలైన విలాసిని, సునందనిలను చంద్రబాబు సన్మానించడంతో రాష్ట్రవ్యాప్తంగా పూల సుబ్బయ్య ఎవరనే చర్చ మొదలైంది. ప్రస్తుత మార్కాపురం జిల్లా కంభంలో 1929లో ఆయన జన్మించారు. బాల్యంలోనే తండ్రి చనిపోవడంతో తల్లి కష్టపడి చదివించింది. విద్యార్థి దశ నుంచే కమ్యూనిస్టు భావజాలానికి ఆకర్షితులయ్యారు.
మార్కాపురం, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): వెలిగొండ ప్రాజెక్టుకు పూల సుబ్బయ్య పేరుపెట్టడం, సభా వేదికపై ఆయన కుమార్తెలైన విలాసిని, సునందనిలను చంద్రబాబు సన్మానించడంతో రాష్ట్రవ్యాప్తంగా పూల సుబ్బయ్య ఎవరనే చర్చ మొదలైంది. ప్రస్తుత మార్కాపురం జిల్లా కంభంలో 1929లో ఆయన జన్మించారు. బాల్యంలోనే తండ్రి చనిపోవడంతో తల్లి కష్టపడి చదివించింది. విద్యార్థి దశ నుంచే కమ్యూనిస్టు భావజాలానికి ఆకర్షితులయ్యారు. ఏఐఎస్‌ఎఫ్ నాయకునిగా, న్యాయవాదిగా, కార్మికసంఘం నేతగా, తాలూకా, జిల్లా స్థాయి పదవులు చేపడుతూ ఏపీ రైతుసంఘం కార్యదర్శిగా ఎదిగారు. 1962, 67ల్లో ఎర్రగొండపాలెంలో సీపీఐ తరఫున రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మూడో సారి 1978లో మార్కాపురం నుంచి ఎన్నికయ్యారు. గిరిజన సమస్యలు, వారి హక్కులకై పోరాడారు. ఆయనను వారు తెల్లదొర అని పిలుచుకునే వారు. సాగు, తాగునీటి సౌకర్యాలు లేక కరువుతో అల్లాడుతున్న ప్రకాశం జిల్లా ప్రజలకు కృష్ణాజలాలు తరలింపే శరణ్యమంటూ ఎన్నో ఉద్యమాలు చేశారు. ఆయన చేసిన ప్రతిపాదనతో ఎన్‌టీఆర్ హయాంలో ఇంజనీర్ సలహాదారు రామకృష్ణయ్యను ప్రాజెక్టు నివేదిక తయారుచేయాలని సూచించారు. అలా ఎన్టీఆర్ హయాంలో పురుడు పోసుకున్న ప్రాజెక్టుకు 1996 మార్చి 5న చంద్రబాబు శంకుస్థాపన చేశారు. 1988 జూన్ 23న 58 ఏళ్ల వయసులో అనారోగ్యంతో సుబ్బయ్య మృతిచెందారు. వెలిగొండ కోసం పోరాటం చేసిన ఆయన పేరు ఈ ప్రాజెక్టుకు పెట్టాలని పలువురి సూచించడంతో నాటి సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ‘పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు’ అని పేరు పెట్టారు.
ఇవి కూడా చదవండి
2027 యూపీ ఎన్నికలు.. డింపుల్ యాదవ్ కేంద్రంగా అఖిలేష్ కీలక వ్యూహం..
పెట్రోల్‌లో ఇథనాల్ శాతం వెల్లడించాలని పిటిషన్.. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం..