తీవ్ర విషాదం.. చేపల వేటకు వెళ్లి ఐదుగురి మృతి..
ABN , Publish Date - Jul 18 , 2026 | 02:34 PM
పోలవరం జిల్లా ఎటపాక మండలం గొల్లగూడెం వద్ద తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గోదావరిలో చేపల వేటకు వెళ్లి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.
పోలవరం జిల్లా: ఎటపాక మండలం గొల్లగూడెం వద్ద తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గోదావరిలో చేపల వేటకు వెళ్లి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతిచెందిన వారిని ఊకె సుశీల(37), ఊకె లక్ష్మి(37), తుర్రం భారతి(40), భాసుబోయిన బాలరాజు (38), ఊకె రమేశ్ (38)గా పోలీసులు గుర్తించారు. వారంతా గొమ్ము కొత్తగూడెం గ్రామ వాసులుగా వెల్లడించారు. బాధితులంతా చేపలు పట్టేందుకు గోదావరి నదిలోకి వెళ్లారు. అయితే, ప్రమాదవశాత్తూ వారంతా గల్లంతయ్యారు.
ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. స్థానికుల సహాయంతో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చివరికి వారిని విగతజీవులుగా బయటకు తీశారు. ఈ ఘటనతో గొమ్ము కొత్తగూడెంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. బాధిత కుటుంబాల సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
గాజువాకలో దారుణం.. కుమార్తెపై తండ్రి అఘాయిత్యం
ఉప్పల్ భగాయత్ ఫేజ్-2లో బైక్ రేసర్ల వీరంగం