వైసీపీ ప్రభుత్వంలో రైతులను ముప్పుతిప్పలు పెట్టారు: మంత్రి నిమ్మల
ABN , Publish Date - May 10 , 2026 | 03:57 PM
పాలకొల్లు నియోజకవర్గంలో రూ 5.61 కోట్లతో పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలు అమలు చేసి మాట నిలబెట్టుకున్నామని తెలిపారు.
పశ్చిమ గోదావరి జిల్లా, మే 10: పాలకొల్లు నియోజకవర్గంలో రూ 5.61 కోట్లతో పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలు అమలు చేసి మాట నిలబెట్టుకున్నామని తెలిపారు. వ్యవసాయం, రైతు సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుందని మంత్రి వెల్లడించారు.
'2025-26 రబీ సీజన్లో రాష్ట్రంలో 1679 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 17.47 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరించాం. ధాన్యం అమ్మిన 24 గంటల్లో 1.67 లక్షల మంది రైతుల ఖాతాలో రూ. 3870 కోట్లు జమ చేశాం. గత వైసీపీ ప్రభుత్వంలో రైతులను అన్ని విధాల, ముప్పుతిప్పలు పెట్టారు. రానున్న సీజన్ కోసం కాలువల్లో తూడు, గుర్రపు డెక్క, పూడిక, తవ్వకం పనుల కోసం రూ. 397 కోట్లు కేటాయుంచి పనులు చేస్తున్నాం' అని మంత్రి రామానాయుడు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి...
డీఎంకే ఓటమికి అవినీతి పాలనే కారణం: మంత్రి సత్యకుమార్
జగన్ అండ్ కో క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు.. ఎంపీ శ్రీ భరత్ ధ్వజం
సింగపూర్ మోడల్‌లో ఫిర్యాదుల పరిష్కారానికి సీఎం చంద్రబాబు ప్లాన్