ఆర్‌ఎంపీ వైద్యం వికటించి ఎనిమిదేళ్ల బాలిక మృతి
ABN , Publish Date - May 07 , 2026 | 04:03 PM
ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలం కోర్సవారిగూడెంలో ఆర్ఎంపీ చేసిన వైద్యం వికటించి ఎనిమిదేళ్ల బాలిక మృతి చెందింది. బాలికకు జ్వరం రావడంతో తల్లిదండ్రులు తొలుత దొరమామిడి పీహెచ్‌సీకి తరలించగా సాధారణ జ్వరమని వైద్యులు చికిత్స అందజేశారు.
ఏలూరు జిల్లా, మే 7: బుట్టాయగూడెం మండలం కోర్సవారిగూడెంలో ఆర్ఎంపీ చేసిన వైద్యం వికటించి ఎనిమిదేళ్ల బాలిక మృతి చెందింది. బాలికకు జ్వరం రావడంతో తల్లిదండ్రులు తొలుత దొరమామిడి పీహెచ్‌సీకి తరలించగా సాధారణ జ్వరమని వైద్యులు చికిత్స అందజేశారు. ఆపై జ్వరం వస్తూ.. తగ్గుతుండడంతో జీడిపూడికి చెందిన ఆర్ఎంపీ రమేశ్ మూడు రోజుల పాటు బాలికకు చికిత్స అందించాడు. పరిస్థితి విషమించడంతో జంగారెడ్డిగూడెం ప్రైవేట్ ఆసుపత్రికి ఆర్‌ఎంపీ రిఫర్ చేశాడు. అక్కడి తీసుకెళ్లగా రాజమండ్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. దీంతో మెరుగైన వైద్యం కోసం రాజమండ్రి తరలిస్తూ ఉండగా కొయ్యలగూడెం సమీపంలో బాలిక మృతి చెందింది.
విషయం తెలిసిన వైద్యాధికారులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు. ఆర్ఎంపీ అధిక మోతాదులో మందులు ఇవ్వడం వల్లే బాలిక చనిపోయిందని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఆర్ఎంపీ రమేశ్.. అనధికారికంగా వైద్యం చేస్తున్నాడని, అనుమతులు లేకుండా ల్యాబ్ నిర్వహిస్తున్నట్లు గుర్తించిన వైద్యాధికారులు ఈ విషయంపై ఉన్నతాధికారులకు నివేదిక పంపించారు.
ఇవి కూడా చదవండి...
తిరుమల లడ్డూ వివాదం.. ఏకసభ్య కమిషన్ నివేదికపై కమిటీ
సింగపూర్ విధానాల అమలుకు 90 రోజుల యాక్షన్ ప్లాన్: సీఎం చంద్రబాబు
Read Latest AP News And Telugu News