Share News

సింగపూర్ విధానాల అమలుకు 90 రోజుల యాక్షన్ ప్లాన్: సీఎం చంద్రబాబు

ABN , Publish Date - May 07 , 2026 | 02:43 PM

నేర్చుకోవటం అనేది నిరంతర ప్రక్రియ అని కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. అత్యుత్తమ విధానాలు ఎక్కడున్నా అమలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయని అన్నారు.

సింగపూర్ విధానాల అమలుకు 90 రోజుల యాక్షన్ ప్లాన్: సీఎం చంద్రబాబు
CM Chandrababu

అమరావతి, మే 7: మంత్రుల సింగపూర్ పర్యటనపై జిల్లా కలెక్టర్ల సమావేశంలో ఇచ్చిన ప్రజెంటేషన్ తదితర అంశాలపై సీఎం చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. నేర్చుకోవటం అనేది నిరంతర ప్రక్రియ అని తెలిపారు. అత్యుత్తమ విధానాలు ఎక్కడున్నా అమలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయని అన్నారు. సింగపూర్‌లో అనుసరిస్తున్న పాలనా విధానాలు అక్కడి ప్రజల విశ్వాసాన్ని దక్కించుకున్నాయని చెప్పారు. సింగపూర్‌లోని అత్యుత్తమ విధానాలను తీసుకుని ఓ జిల్లాను మోడల్‌గా అభివృద్ధి చేద్దామని అన్నారు. సింగపూర్ విధానాల అమలుకు 90 రోజుల యాక్షన్ ప్లాన్ తయారు చేసి పర్యవేక్షణ చేయాలని సూచించారు. ‘నేను కాదు మనం అనే విధానంలో ముందుకు వెళ్తాం.. ఈ విధానం నేటి నుంచి నాతో మొదలవుతుంది’ అని సీఎం పేర్కొన్నారు.


కలెక్టర్ల మధ్య అభివృద్ధిలో పోటీ ఉండాలి..

బెంచ్ మార్క్ సెట్ చేసేలా ఏపీ అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో రోజుకో ఎంఓయూ.. వారానికో శంకుస్థాపన జరుగుతోందన్నారు. వేగంగా పనిచేయాలని.. అంతే వేగంగా అభివృద్ధి చూపించాలని సూచించారు. స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ స్లోగన్‌కే పరిమితం కాకూడదన్నారు. పబ్లిక్ రిలేషన్స్ ఎంత ముఖ్యమో... పబ్లిక్ డెలివరీ అంతే ముఖ్యమని స్పష్టం చేశారు. వినూత్నంగా ఆలోచిస్తే నిధుల కొరతను అధిగమించవచ్చన్నారు. జిల్లా కలెక్టర్ల మధ్య అభివృద్ధిలో పోటీ ఉండాలని తెలిపారు. కాలేజీ రోజుల్లో రాయల్ ఎన్‌ఫీల్డ్ డ్రైవ్ చేశానని... ఇప్పుడు ఆ సంస్థను ఏపీకి తెచ్చామని కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.


ఇవి కూడా చదవండి...

ఇద్దరు అంతర్ జిల్లా దొంగల అరెస్ట్.. కోటి సొత్తు స్వాధీనం

తిరుమల లడ్డూ వివాదం.. ఏకసభ్య కమిషన్ నివేదికపై కమిటీ

Read Latest AP News And Telugu News

Updated Date - May 07 , 2026 | 03:09 PM