స్థానిక ఎన్నికల ఓటర్ల జాబితా సిద్ధం
ABN , Publish Date - Sep 04 , 2026 | 04:44 AM
రాష్ట్రంలోని పట్టణ స్థానిక సంస్థల రెండో సాధారణ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఫొటో ఓటర్ల జాబితాల తయారీ, ప్రచురణకు సంబంధించి గతనెల 12న రెండు నోటిఫికేషన్లు జారీ చేసింది.
58 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ప్రచురణ
అమరావతి, సెప్టెంబరు 3(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని పట్టణ స్థానిక సంస్థల రెండో సాధారణ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఫొటో ఓటర్ల జాబితాల తయారీ, ప్రచురణకు సంబంధించి గతనెల 12న రెండు నోటిఫికేషన్లు జారీ చేసింది. రాష్ట్రంలోని పట్టణ స్థానిక సంస్థల కమిషనర్ల నుంచి అందిన నివేదికల ప్రకారం ఫొటో ఓటరు జాబితాలను తాజాగా ప్రచురించిన 58 మున్సిపాలిటీలు/ నగర పంచాయతీలు, ఒక మున్సిపల్ కార్పొరేషన్ కలిపి మొత్తం 59 పట్టణ స్థానిక సంస్థల్లో 1,971 వార్డులకు సంబంధించిన వివరాలను అనుబంధ జాబితాలో పొందుపరిచింది. ఇందులో విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్‌లో 62 వార్డులు ఉన్నాయి. అనుబంధ జాబితాలో అద్దంకి, ఆదోని, ఆకివీడు, ఆళ్లగడ్డ, అమలాపురం, ఆత్మకూరు, బేతంచెర్ల, బొబ్బిలి, బుచ్చిరెడ్డిపాలెం, చీమకుర్తి, దాచేపల్లి, దర్శి, డోన్, గిద్దలూరు, గొల్లప్రోలు, గూడూరు, గుంతకల్, గురజాల, హిందూపురం, ఇచ్ఛాపురం, జంగారెడ్డిగూడెం, కొండపల్లి, కోవూరు, కుప్పం, కర్నూలు తదితర పట్టణ స్థానిక సంస్థలున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గురువారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.
ఇవి కూడా చదవండి
రోహిత్ శర్మ రిటైర్‌మెంట్‌పై క్లారిటీ
పదవి ఉన్నా.. లేకున్నా ప్రజలతోనే: మాజీ మంత్రి చిన్నారెడ్డి