తుఫాను సాయంపై చలించిన ప్రయాణికులు!
ABN , Publish Date - Nov 04 , 2026 | 04:15 AM
మురసు తుఫాన్ తీవ్రతతో గాలులు బలంగా వీయడంతో బాపట్ల రైల్వేస్టేషన్‌లో సోమవారం అర్ధరాత్రి తర్వాత రెండున్నర గంటల సమయంలో రెండు రైళ్లను నిలిపివేశారు.
బాపట్ల రైల్వే స్టేషన్లో భారత్‌మాతాకి జై నినాదాల హోరు
బాపట్ల, నవంబరు 3(ఆంధ్రజ్యోతి): మురసు తుఫాన్ తీవ్రతతో గాలులు బలంగా వీయడంతో బాపట్ల రైల్వేస్టేషన్‌లో సోమవారం అర్ధరాత్రి తర్వాత రెండున్నర గంటల సమయంలో రెండు రైళ్లను నిలిపివేశారు. 12968 నంబరు జైపూర్ నుంచి చెన్నై వెళ్లే రైలు, 22869 నంబరు విశాఖపట్నం నుంచి చెన్నై వెళ్లే రైళ్లు రెండూ బాపట్ల రైల్వే స్టేషన్‌లో అధికారులు నిలిపేశారు. వీరికి అల్పాహారంతో పాటు భోజన సదుపాయం, వాటర్ బాటిళ్లను ఇవ్వడానికి స్థానికంగా ఉండే స్వచ్ఛంద సేవా సంస్థలతో పాటు స్థానిక ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మ సహకారం అందించారు.
ఈ క్రమంలో ఎన్‌జీవోల దాతృత్వం చూసి చలించిన రైలు ప్రయాణికులు.. జైభారత్‌మాత నినాదాలతో స్టేషన్ ప్రాంగణాన్ని హోరెత్తించారు. దాదాపు 13 గంటల హాల్టింగ్ తర్వాత మంగళవారం సాయంత్రం 4 గంటల సమయంలో ఆ రైళ్లకు అధికారులు పచ్చజెండా ఊపారు.
ఈ వార్తలనూ చదవండి:
కుప్పంలో టీడీపీ జైత్రయాత్ర.. 32 వార్డులూ కైవసం