Share News

తల్లి మృతి.. అయినా ఎన్నికల విధుల్లోనే..!

ABN , Publish Date - Nov 30 , 2026 | 02:16 AM

కన్నతల్లి మరణించిందన్న వార్త విన్న ఆ ఉపాధ్యాయుడి గుండె పగిలింది.

తల్లి మృతి.. అయినా ఎన్నికల విధుల్లోనే..!
teacher

ఉపాధ్యాయుడి నిబద్ధత.. విజయనగరం జిల్లాలో ఘటన

రాజాం రూరల్‌, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): కన్నతల్లి మరణించిందన్న వార్త విన్న ఆ ఉపాధ్యాయుడి గుండె పగిలింది. అయినా.. ఎన్నికల విధులను మధ్యలో వదిలి వెళ్లేందుకు ఆయన మనసు అంగీకరించలేదు. విజయనగరం జిల్లా తాడిగూడకు చెందిన టీచర్‌ రామకృష్ణను కంచరాం పోలింగ్‌ కేంద్రానికి ఆర్‌వోగా నియమించారు. ఆదివారం విధుల్లో ఉండగా.. తన తల్లి మృతి చెందిన వార్త తెలియడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. అయినప్పటికీ దుఃఖాన్ని దిగమింగుకుంటూ ఆదివారం రాత్రి వరకు విధుల్లో కొనసాగారు.

ఈ వార్తలనూ చదవండి:

డీలిమిటేషన్‌తో ఏ రాష్ట్రానికి ఎన్ని సీట్లు పెరుగుతాయో తెలుసా?

అఫ్గానిస్థాన్‌లో భారీ పేలుడు.. ఆరుగురు విద్యార్థుల మృతి, 97 మందికి గాయాలు..!

Updated Date - Nov 30 , 2026 | 03:31 AM