Share News

కొటియాలో ఇద్దరి గిరిజనుల అరెస్టు.. ఒడిశా పోలీసులపై మంత్రి ఫైర్..

ABN , Publish Date - Apr 26 , 2026 | 04:35 PM

జనగణనకు సహకరించలేదని కొటియాలో ఇద్దరు గిరిజనులను ఒడిశా పోలీసులు అరెస్టు చేశారు. వారిని అరెస్టు చేయడంపై ఏపీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఆగ్రహించారు. కొటియా గిరిజనులను ఒడిశా పోలీసులు అరెస్టు చేస్తే సహించేది లేదని తేల్చి చెప్పారు.

కొటియాలో ఇద్దరి గిరిజనుల అరెస్టు.. ఒడిశా పోలీసులపై మంత్రి ఫైర్..
Minister Sandhya Rani

పార్వతీపురం మన్యం: జనగణనకు సహకరించలేదని కొటియాలో ఇద్దరు గిరిజనులను ఒడిశా పోలీసులు అరెస్టు చేశారు. వారిని అరెస్టు చేయడంపై ఏపీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఆగ్రహించారు. కొటియా గిరిజనులను ఒడిశా పోలీసులు అరెస్టు చేస్తే సహించేది లేదని తేల్చి చెప్పారు. ఏపీలో మీ దౌర్జన్యం ఏంటని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని మంత్రి ప్రశ్నించారు. ఆ ప్రాంతం ఏపీకి చెందినదే అని స్పష్టం చేశారు. తమ భూభాగంలో మీ పెత్తనం ఏంటని ఒడిశా పోలీసులను మంత్రి నిలదీశారు. అరెస్టు చేసిన ఇద్దరినీ వెంటనే విడుదల చేయాలని మంత్రి సంధ్యారాణి డిమాండ్ చేశారు.


వివాదం ఏంటి..?

ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల మధ్య కొటియా ప్రాంతం దశాబ్దాలుగా వివాదాస్పదంగా ఉంది. ఏపీలోని విజయనగరం, ఒడిశాలోని కోరాపుట్ జిల్లాల మధ్య ఈ ప్రాంతం ఉంది. ఇక్కడ ఉన్న 21 గ్రామాలను కొటియా గ్రామాలుగా పిలుస్తుంటారు. అయితే, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలుగా ఏర్పడిన సమయంలో ఈ గ్రామాలను ఏ రాష్ట్రంలోనూ కలపలేదు. దీంతో ఇరు రాష్ట్రాల మధ్య వివాదం తలెత్తింది. ఆ ప్రాంతం తమదంటే తమదంటూ వాదించాయి.


ఈ సమస్యపై 1968లో రెండు రాష్ట్రాలు సుప్రీంకోర్టుకు వెళ్లాయి. ఏళ్ల తరబడి విచారణ అనంతరం ఈ పంచాయితీని పార్లమెంట్‌లో పరిష్కరించుకోవాలని 2006లో ధర్మాసనం తీర్పునిచ్చింది. అయితే, నేటికీ ఈ సమస్య పరిష్కారం కాలేదు. కొటియా గ్రామాలను తమ ప్రాంతంగా రెండు రాష్ట్రాలు ప్రకటించుకున్నాయి. అక్కడ ఉన్న గిరిజనులకు ఇరు రాష్ట్రాలు తమ ప్రభుత్వ పథకాలను అందిస్తున్నాయి. వారి వద్ద రెండు రాష్ట్రాల ఓటర్ కార్డులు ఉంటాయి.


ఈ వార్తలు కూడా చదవండి

డీజిల్ కొరతపై సీఎం చంద్రబాబు సమీక్ష.. సమస్యను పరిష్కరించాలంటూ ఆదేశం..

ఇంధన సరఫరాలో ప్రజలకు వాస్తవాలు చెప్పండి: మంత్రి నాదెండ్ల

Updated Date - Apr 26 , 2026 | 04:39 PM