Share News

బాబాయ్‌ హత్యతో అబ్బాయ్‌కే లాభం: నిమ్మల

ABN , Publish Date - Oct 01 , 2026 | 05:01 AM

బాబాయ్‌ హత్యతో అబ్బాయి మాత్రమే లాభం పొందాడని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

బాబాయ్‌ హత్యతో అబ్బాయ్‌కే లాభం: నిమ్మల

బాబాయ్‌ హత్యతో అబ్బాయి మాత్రమే లాభం పొందాడని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘వివేకా హత్య కేసులో ప్రధాన నిందితుడు సునీల్‌ యాదవ్‌ వాస్తవాలు వెల్లడిస్తుంటే జగన్‌ ఎందుకు నోరు విప్పడం లేదు? వివేకా హత్యతో అంతిమంగా లబ్ధి పొందింది జగన్‌, ఆయన కుటుంబ సభ్యులు, అవినాశ్‌ రెడ్డి మాత్రమేనని సునీల్‌ చెప్పిన నేపథ్యంలో ప్రజలకు జగన్‌ సమాధానం చెప్పాలి. దస్తగిరి చెప్పిన నిజాలు, సునీల్‌ యాదవ్‌ వెల్లడించిన వాస్తవాలు, దర్యాప్తు సంస్థల నివేదికలు, గూగుల్‌ టేక్‌ అవుట్‌ సాంకేతిక ఆధారాలు, ఈడీ అటాచ్‌మెంట్లు... అన్నీ బాబాయ్‌ హత్యకు సూత్రధారి తాడేపల్లి ప్యాలెస్‌ అనే చెబుతున్నాయి’ అని నిమ్మల ఆరోపించారు.

ఈ వార్తలనూ చదవండి...

ఉన్నతంగా బతికి... మానసికంగా ‘చితికి’

రైతులకు తీపి కబురు

Updated Date - Oct 01 , 2026 | 05:01 AM