Share News

విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల ఈ-వేలంలో ట్విస్ట్.. 35 ప్లాట్ల ఉపసంహరణ

ABN , Publish Date - Oct 28 , 2026 | 08:34 PM

విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల ఈ-వేలంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. వేలం ప్రక్రియ నుంచి 35 ప్లాట్లను ఎన్ఎల్ఎంసీ (National Land Monetization Corporation) ఉపసంహరించింది.

విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల ఈ-వేలంలో ట్విస్ట్.. 35 ప్లాట్ల ఉపసంహరణ

ఢిల్లీ, అక్టోబర్ 26: విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల ఈ-వేలంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. వేలం ప్రక్రియ నుంచి 35 ప్లాట్లను ఎన్ఎల్ఎంసీ (National Land Monetization Corporation) ఉపసంహరించింది. ఈ మేరకు కేంద్ర సంస్థ ఇవాళ(బుధవారం) వివరణ విడుదల చేసింది. మిగిలిన స్టీల్ ప్లాంట్ భూముల వేలం షెడ్యూల్‌నూ ఎన్ఎల్ఎంసీ సవరించింది. బిడ్డర్ల రిజిస్ట్రేషన్, ధరావతు (EMD) చెల్లింపు గడువు నవంబర్ 1 వరకు పొడిగించింది. నవంబర్ 3న ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మిగిలిన ప్లాట్ల ఈ-వేలం నిర్వహించనుంది. ఆగస్టు 31న జారీ చేసిన నోటిఫికేషన్‌లోని మిగతా నిబంధనలు ఎన్ఎల్ఎంసీ యథాతథంగా ఉంచింది.


ఈ వార్తలూ చదవండి

అలర్ట్: రాగల మూడు గంటలు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

తుఫాన్ హెచ్చరికలతో దుర్గగుడి అధికారుల అప్రమత్తం..

Updated Date - Oct 28 , 2026 | 08:34 PM