అలర్ట్: రాగల మూడు గంటలు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
ABN , Publish Date - Oct 28 , 2026 | 07:24 PM
రాగల మూడు గంటలు ఏపీలోని 8 జిల్లాల్లో వర్షాలు కురిస్తాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) తెలిపింది.
అమరావతి. అక్టోబర్ 28: రాగల మూడు గంటలు ఏపీలోని 7 జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) తెలిపింది. శ్రీకాకుళం, ఏలూరు, కోనసీమ, తూగో, పగో, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని ఆ సంస్థ హెచ్చరించింది. గంటకు 50-60కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని వెల్లడించింది. ఈ క్రమంలో ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని APSDMA ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు.
ఈ వార్తలూ చదవండి
ఆర్నబ్ తుఫాన్‌తో పంట, ఆస్తి నష్టపోయిన ప్రతి ఒక్కరికీ న్యాయం: సీఎం చంద్రబాబు
ఆర్నబ్ తుఫాన్ బాధితులకు సీఎం చంద్రబాబు భారీ ఊరట