విశాఖలో ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం..!
ABN , Publish Date - Oct 06 , 2026 | 05:16 PM
కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పర్యటనలో ఓ ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం కలకలం రేపుతోంది. సర్వీస్ తుపాకీతో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలుస్తోంది.
విశాఖపట్నం: కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పర్యటనలో ఓ ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం కలకలం రేపుతోంది. సర్వీస్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రి పర్యటన సందర్భంగా విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ కొండబాబు.. తన ఎస్‌ఎల్‌ఆర్ గన్‌తో కాల్చుకుని బలవన్మరణానికి యత్నించినట్లు సమాచారం. ఈ ఘటన ఐఎన్‌ఎస్ డేగ సమీపంలో జరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
తీవ్రంగా గాయపడిన కొండబాబును వెంటనే కిమ్స్ ఆసుపత్రికి తరలించగా.. వైద్యులు చికిత్స అందిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే, కానిస్టేబుల్ పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై స్థానిక పోలీసులు విచారణ ప్రారంభించి, ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. రక్షణ మంత్రి పర్యటన సందర్భంగా భద్రతా ఏర్పాట్లు కఠినంగా ఉన్నా ఈ ఘటన జరగడం పోలీస్ వర్గాల్లో ఆందోళన కలిగించింది. పోలీసు అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, సాక్షుల నుంచి సమాచారం సేకరిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి..
శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు.. సీఎం చంద్రబాబుకు ఆహ్వానం
పాకిస్థాన్‌కు రహస్య సమాచారం చేరవేత.. ఇద్దరి అరెస్ట్