క్రిప్టో కరెన్సీ పేరిట రూ.10 కోట్లు వసూలు.. నిందితుడి అరెస్ట్
ABN , Publish Date - Jun 03 , 2026 | 12:05 PM
క్రిప్టో కరెన్సీ పేరిట అధిక లాభాల ఆశ చూపి సుమారు 50 మంది నుంచి రూ.10 కోట్లు వసూలు చేసి మోసానికి పాల్పడ్డ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. బిర్లా జంక్షన్‌ను కేంద్రంగా చేసుకుని ‘పంక్ పాండా’, ‘ఐటీసీ గ్లోబల్’, ‘కేగుష్’ అనే పేర్లతో వెబ్‌సైట్లు, అప్లికేషన్లను ఆజీమ్ సృష్టించాడు.
విశాఖపట్నం, జూన్ 3: క్రిప్టో కరెన్సీ పేరిట అధిక లాభాల ఆశ చూపి సుమారు 50 మంది నుంచి రూ.10 కోట్లు వసూలు చేసి మోసానికి పాల్పడ్డ మహ్మద్ ఆజీమ్ ఖాన్ అనే వ్యక్తిని విశాఖ కంచరపాలెం పోలీసులు అరెస్ట్ చేశారు. బిర్లా జంక్షన్‌ను కేంద్రంగా చేసుకుని ‘పంక్ పాండా’, ‘ఐటీసీ గ్లోబల్’, ‘కేగుష్’ అనే పేర్లతో వెబ్‌సైట్లు, అప్లికేషన్లను ఆజీమ్ సృష్టించాడు. పెట్టుబడులపై గ్యారంటీ లాభాలు ఇస్తామని ప్రచారం చేశాడు. జూమ్ మీటింగుల ద్వారా అమాయకులను ఆకర్షించి మోసం చేశాడని పోలీసులు తెలిపారు.
2021 నుంచి 2025 వరకు నిందితుడు భారీగా పెట్టుబడులు సేకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. పెట్టుబడి మొత్తం తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేసిన బాధితుడిని ఉన్నతాధికారులతో పరిచయాలు ఉన్నాయని, హనీట్రాప్‌లో ఇరికిస్తానని బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ బాధితుడి నుంచి అదనంగా రూ.10 లక్షలు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. డబ్బులు వసూలు చేసిన తర్వాత నిందితుడు సంబంధిత వెబ్‌సైట్లు, అప్లికేషన్లను మూసివేసి పరారయ్యాడు. మోసపోయిన బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కంచరపాలెం పోలీసులు కేసు నమోదు చేసి.. ఆజీమ్‌ను అదుపులోకి తీసుకున్నారు.
ఇవి కూడా చదవండి..
మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ ఆవరణలో భక్తురాలి మృతి
ముఖ్యమంత్రి అంటే విజన్ ఉండాలి.. జగన్‌కు లేదు: మంత్రి నారాయణ
Read Latest AP News And Telugu News