అంతర్జాతీయ టెక్ మ్యాప్‌లో విశాఖకు చోటు
ABN , Publish Date - Apr 26 , 2026 | 08:30 PM
విశాఖపట్నంలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు కానుంది. ఈ నేపథ్యంలో ఈ తూర్పు కోస్తా తీర నగరానికి విశ్వఖ్యాతి లభించినట్లు అయింది. అంతర్జాతీయ టెక్ మ్యాప్‌లో విశాఖపట్నం చోటు సంపాదించింది..
అమరావతి, ఏప్రిల్ 26: విశాఖపట్నంలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు కానుంది. ఈ నేపథ్యంలో ఈ తూర్పు కోస్తా తీర నగరానికి విశ్వఖ్యాతి లభించినట్లు అయింది. అంతర్జాతీయ టెక్ మ్యాప్‌లో విశాఖపట్నం చోటు సంపాదించింది. విశాఖలో ఏర్పాటు కానున్న గూగుల్ ఏఐ డేటా సెంటర్ శంకుస్థాపనకు ముహూర్తం ఖరారైంది. ఏప్రిల్ 28వ తేదీన ఈ డేటా సెంటర్‌కు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో ఒక గిగా వాట్ సామర్థ్యంతో ఈ గూగుల్ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నారు.
విశాఖలో వివిధ సంస్థలు ఏర్పాటు చేసేందుకు ప్రపంచంలోని పలు దేశాలకు చెందిన టెక్ సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. గతేడాది నవంబర్‌లో విశాఖ వేదికగా జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సు ద్వారా రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వెల్లువెత్తిన విషయం విదితమే. అలాగే ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువతకు రాష్ట్రంలోనే ఉద్యోగాలు కల్పించాలనే సంకల్పంతో కూటమి ప్రభుత్వం ఉంది. అందుకోసం ఆ దిశగా అడుగులు వేస్తోంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పలు పరిశ్రమలు ఏర్పాటు చేయడం ద్వారా యువతకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం వ్యూహాత్మకంగా చర్యలు చేపడుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
రుద్రంపేట ఘటనపై రాయపాటి శైలజ ఆరా
ఉపాధితో మారుతున్న ఉత్తరాంధ్ర ముఖచిత్రం: వీఏంఆర్‌డీఏ చైర్మన్
For More AP News And Telugu News