Share News

24 గంటలూ అప్రమత్తంగా ఉండాలి.. అధికారులకు జీవీఎంసీ కమిషనర్ ఆదేశాలు

ABN , Publish Date - Oct 28 , 2026 | 01:36 PM

ఆర్నబ్ తుఫాన్ నేపథ్యంలో జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ అన్ని జోన్లలో క్షేత్రస్థాయిలో పర్యటించారు. నిన్న, ఈరోజు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన కమిషనర్.. ఈదురుగాలులు, వర్షాలకు నేలకూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలు తదితర ప్రాంతాలను పరిశీలించారు.

24 గంటలూ అప్రమత్తంగా ఉండాలి.. అధికారులకు జీవీఎంసీ కమిషనర్ ఆదేశాలు
GVMC Commissioner

విశాఖపట్నం, అక్టోబర్ 28: ఆర్నబ్ తుఫాన్ నేపథ్యంలో జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ అన్ని జోన్లలో క్షేత్రస్థాయిలో పర్యటించారు. నిన్న, ఈరోజు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన కమిషనర్.. ఈదురుగాలులు, వర్షాలకు నేలకూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలు తదితర ప్రాంతాలను పరిశీలించారు. ప్రజల ఫిర్యాదుల స్వీకరణ, పర్యవేక్షణలో 24 గంటలూ అప్రమత్తంగా ఉండాలని సిటీ ఆపరేషన్ సెంటర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సిటీ ఆపరేషన్ సెంటర్ ద్వారా అందే ఫిర్యాదులపై నిరంతర పర్యవేక్షణ చేపట్టి తక్షణ చర్యలు తీసుకోవాలని అదనపు కమిషనర్ ఎస్.ఎస్.వర్మను ఆదేశించారు. టెలికాన్ఫరెన్స్‌ల ద్వారా జోనల్ కమిషనర్లు, విభాగాధికారులకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేశారు.


ప్రధాన రహదారులపై నేలకూలిన, విరిగిన చెట్లను యుద్ధ ప్రాతిపదికన తొలగించాలని జీవీఎంసీ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. చెట్ల కొమ్మలను కటింగ్ చేసి, రహదారులకు అడ్డంకులు లేకుండా వెంటనే తరలించాలని అధికారులకు సూచనలు చేశారు. ప్రజారోగ్య చర్యలపై ప్రతి అరగంటకూ నివేదిక అందించాలని అదనపు కమిషనర్, ప్రధాన వైద్యాధికారికి ఆదేశాలు జారీ చేశారు. తాగునీటి సరఫరాలో అంతరాయం లేకుండా, నీరు కలుషితం కాకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ వెల్లడించారు. తుఫాన్ ప్రభావిత ప్రజల కోసం జీవీఎంసీ పరిధిలో 56 పునరావాస కేంద్రాల ఏర్పాటు చేశారు. 12 పునరావాస కేంద్రాల్లో 490 మంది బాధితులకు ఆశ్రయం కల్పించడంతో పాటు వారికి భోజన సదుపాయాలను అధికారులు ఏర్పాటు చేశారు.


ఇవి కూడా చదవండి...

తీరం దాటిన ఆర్నబ్ తుఫాన్.. ఉత్తర కోస్తాకు భారీ వర్ష సూచన

ఆర్నబ్ తుఫాన్‌పై సీఎం చంద్రబాబు సమీక్ష.. సీసీ కెమెరాలతో పరిస్థితుల పరిశీలన

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 28 , 2026 | 01:42 PM