Share News

దక్షిణాఫ్రికాలో కొనసాగుతున్న అయ్యన్నపాత్రుడు పర్యటన..

ABN , Publish Date - Sep 12 , 2026 | 09:54 PM

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడి పర్యటన దక్షిణాఫ్రికాలో కొనసాగుతోంది. ఏపీ వన్యప్రాణి, పర్యావరణ పరిరక్షణ కమిటీ ఛైర్మన్‌గా ఉన్న ఆయన.. దక్షిణాఫ్రికాలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు.

దక్షిణాఫ్రికాలో కొనసాగుతున్న అయ్యన్నపాత్రుడు పర్యటన..
AP Speaker Ayyanna Patrudu

అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడి పర్యటన దక్షిణాఫ్రికాలో కొనసాగుతోంది. ఏపీ వన్యప్రాణి, పర్యావరణ పరిరక్షణ కమిటీ ఛైర్మన్‌గా ఉన్న ఆయన.. దక్షిణాఫ్రికాలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో నెల్సన్ మండేలా నివాసాన్ని అయ్యన్నపాత్రుడు సందర్శించారు. అలాగే, ఆయన జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన మ్యూజియాన్ని కూడా వీక్షించారు.


ఈ సందర్భంగా నెల్సన్ మండేలా సాగించిన వీరోచిత పోరాటాన్ని స్పీకర్ గుర్తు చేసుకున్నారు. వర్ణ వివక్షను అంతం చేయడానికి, అణచివేతదారుల పాలన నుంచి దక్షిణాఫ్రికా ప్రజలకు విముక్తి కల్పించడానికి కృషి చేశారని కొనియాడారు. అనంతరం జోహన్నెస్‌బర్గ్ సమీపంలోని ప్రసిద్ధ లయన్ అండ్ సఫారీ పార్కునూ స్పీకర్ అయ్యన్నపాత్రుడు సందర్శించారు. ఈ సందర్భంగా విశాలమైన ప్రాంగణాల్లోని వివిధ జంతువులను ఆయన వీక్షించారు. ప్రపంచవ్యాప్తంగా భారీగా పర్యాటకులను ఆకర్షించేలా ఈ పార్కును ఎంత సమర్థవంతంగా నిర్వహిస్తున్నారనే విషయాలను అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటనలో సభాపతి వెంట శాసనసభ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ సూర్యదేవర ఉన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

2027 నాటికి వందశాతం అక్షరాస్యతే లక్ష్యం.. కలెక్టర్లకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం

ఏపీ 2026-27 ఎక్సైజ్ పాలసీని ప్రకటించిన ఏపీ సర్కార్.. మద్యం షాపులపై కీలక నిర్ణయాలు

Updated Date - Sep 12 , 2026 | 09:54 PM